తండ్రి ఎన్టీఆర్‌‌కు నివాళులు అర్పించిన బాలకృష్ణBalakrishna
2020-05-28 10:37:34

ఈరోజు తన తండ్రి ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్లో నివాళులు అర్పించారు నందమూరి బాలకృష్ణ. సతీమణి వసుంధర, తన అన్న రామకృష్ణ తదితరులతో కలిసి ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. ఈ నేపధ్యంలో మాట్లాడిన ఆయన కరోన నేపథ్యంలో  తెలుగు సినీ పరిశ్రమ పడుతున్న ఇబ్బందులపై ప్రభుత్వం ఎలాంటి  నిర్ణయం తీసుకుంటుందో చూడాలని అన్నారు. పరిశ్రమ పుంజుకోవడానికి ఇంకా సమయం పడుతుందన్న ఆయన ప్రభుత్వం తో చర్చలు జరుపుతున్నారని అన్నారు. తనకు ఆ విషయం తెలియదన్న ఆయన పత్రికల ద్వారా, చానెళ్ల ద్వారా తెలుసుకున్నాను. కానీ త్వరగా సమస్యలను పరిష్కరించాలని అన్నారు. జీవో రావాలి జీవో వస్తే ఎప్పటినుంచి షూటింగ్ స్టార్ట్ ఆవుతుందనేది క్లారిటీ వస్తుందని అన్నారు. ఇక కొన్ని సడలింపుల తో జూన్ రెండవ వారంలో ప్రారంభం అవుతుందని బావిస్తున్నామని ఆయన అన్నారు. మిగతా వారిలాగా సినిమా షూటింగ్ ఉండదని, కొంత మంది నన్ను అడిగితే నేను కొన్ని సలహాలు ఇచ్చానని అన్నారు. గతంలో స్టార్ట్ అయిన సినిమాలకు ఎలా అనుమతి ఇస్తారనేది చూడాలని అన్నారు.మరోవైపు ప్రతి యేడాది ఎన్టీఆర్ జయంతి, వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించే జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌ తాజాగా నెలకొన్న కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఇంటి వద్దే నివాళులు అర్పించారు.  
 

More Related Stories