నాగబాబు కామెంట్స్ కి బాలయ్య రియాక్షన్ .. Balakrishna
2020-06-02 16:46:25

కరోనా నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వంతో టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దలు జరిపిన చర్చలు పెను వివాదానికే దారి తీశాయి. ఆ చర్చలకు తనని పిలవలేదని బాలయ్య చేసిన కామెంట్స్ ఒక్కసారిగా అసలు ఇండస్ట్రీలో ఏమి జరుగుతోంది ? అనేలా చేసాయి. మంత్రి తలసానితో కలిసి భూములు ఏమన్నా పంచుకుంటున్నారు ఏmo అని కామెంట్ చేయడం, దీనిపై మెగా బ్రదర్.. బాలయ్యను నోరు అదుపులో పెట్టుకోమంటూ చేసిన కామెంట్స్ చెప్పిన మాటలు పెను దుమారన్నే రేపాయి. ఈ ఇద్దరి మాటల యుద్ధంతో నందమూరి, మెగా ఫ్యాన్స్ కూడా కొట్టుకుంటున్నారు. 

తాజాగా బాలకృష్ణ .. ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగబాబు ఇష్యూపై స్పందించారు. నాగబాబు వ్యాఖ్యలపై తానేమీ అనదలచుకోలేదనీ, ఎవరైనా మర్యాద ఇచ్చి మర్యాద పుచ్చుకోవాలని ఆయన అన్నారు. మా అసోసియేషన్ బిల్డింగ్  కోసం చిరంజీవి మరికొందరు అమెరికా వెళ్లారనీ, అప్పుడు నన్ను పిలవలేదని, అసలు చందాలతో బిల్డింగ్ కట్టాలా.. ఆర్టిస్టులు అనుకుంటే కట్టలేరా అని ప్రస్నించారు. తెలంగాణా గవర్నమెంట్ సపోర్ట్ గా వుంది అంటున్నారు కానీ, "మా"కి 3 ఎకరాలు భూమి  ఇవ్వలేరా ? కరోనా టైం లో షూటింగ్స్ స్టార్ట్ చేసే తొందర ఎందుకు అంటే డబ్బులు, టాక్స్ ల కొసమే అని ఆయన చెప్పుకొచ్చారు. నాగబాబు వ్యాఖ్యల పై నేను స్పందించనన్న బాలయ్య, మరోసారి ఆ విషయం మీద గుచ్చి గుచ్చి అడగ్గా "ఛీ, ఛీ... నేనేమంటాను, అన్నీ ఆయనే మాట్లాడుతున్నాడు కదా. నేను అస్సలు స్పందించను. ఇవాళ ఇండస్ట్రీ మొత్తం నాకు సపోర్ట్ గా నిలుస్తోంది. అలాంటప్పుడు నేనెందుకు మాట్లాడాలని అక్కడితో తెంచేశారు.

More Related Stories