క‌రోనా క‌ల్లోలం..అయినా బాల‌య్య త‌గ్గ‌దే లే



 Balakrishna
2021-05-04 13:17:26

క‌రోనా క‌ల్లోలంతో సినిమా షూటింగ్ ల‌న్నీ వాయిదా ప‌డ్డాయి. పెద్ద సినిమాల‌నుండి చిన్న సినిమాల వ‌ర‌కూ దాదాపు అన్ని సినిమాలు షూటింగ్స్ ను వాయిదా వేసుకున్నాయి. ఒక‌వేళ‌ షూటింగ్ ప్రారంభించినా కుర్ర హీరోలు హీరోయిన్ లు షూటింగ్ ల‌కు వ‌చ్చేదే లే అని చెబుతున్నారు. కానీ నంద‌మూరి బాల‌క్రిష్ణ మాత్రం షూటింగ్ కు హాజ‌ర‌య్యేందుకు సిద్ధ‌మౌతున్నారు. 

ప్ర‌స్తుతం బాల‌య్య బోయ‌పాటి కాంబినేష‌న్ లో అఖండ సినిమా షూటింగ్ జ‌రుపుకుంటున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే క‌రోనాకు భ‌య‌ప‌డకుండా ఈ సినిమా మూడో షెడ్యూల్ ను పూర్తి చేసారు. ఇక ఇప్పుడు నాలుగో షెడ్యూల్ ను సైతం పూర్తి చేసి ప్యాక‌ప్ చెప్పాల‌ని చిత్ర యూనిట్ భావిస్తుంది. అంతే కాకుండా  కొన్ని జాగ్ర‌త్తలు తీసుకుంటూ అతి త‌క్కువ మంది స‌భ్యుల‌తో ఈనెల 12 నుండి షూటింగ్ ను తిరిగి ప్రారంభించాల‌ని బోయ‌పాటి నిర్ణ‌యం తీసుకున్నారు. 

మ‌రోవైపు ఈ షెడ్యూల్ మేజ‌ర్ పార్ట్ ను షూట్ చేయ‌బోతున్నార‌ట‌. అఖండ సినిమా బ‌డ్జెట్ అనుకున్న దానికంటే దాటిపోయింద‌ట‌. దాంతో ఆస‌ల్యం చేస్తే బ‌డ్జెట్ మ‌రింత పెరిగే అవ‌కాశం  ఉంద‌నే కార‌ణంతో త్వర‌లో షూటింగ్ ను పూర్తి చేసి విడుద‌ల తేదీని ప్ర‌కటించాల‌ని చిత్ర యూనిట్ భావిస్తోంది. అందువ‌ల్లే బాల‌య్య కూడా షూటింగ్ లో పాల్గొనేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ట‌. 

More Related Stories