దసరాకి బాలయ్య స్పెషల్ సర్ప్రైజ్Balakrishna.jpg
2019-09-27 07:53:33

నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న 105వ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ శరవేగంగా జరుగుతుంది. జై సింహా లాంటి సినిమా తర్వాత కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వంలో హ్యాపీ మూవీస్‌ బ్యానర్‌ మీద సి.కల్యాణ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. `జైసింహా` లాంటి సినిమా త‌ర్వాత మళ్ళీ కాంబినేష‌న్‌ రిపీట్ కావడంతో సినిమా మీద మంచి అంచనాలే ఉన్నాయి. ఈ మధ్యనే థాయ్‌లాండ్‌లో తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా హైద‌రాబాద్ రామోజీ ఫిలింసిటీలో లెంగ్తీ షెడ్యూల్ షూట్ జరుపుకుంది. ఇక  ఈ చిత్రం మూడో షెడ్యూల్ అక్టోబర్ 5వ తేదీ నుండి ప్రారంభ‌మ‌వ్వనుందని అంటున్నారు. ఇక ఈ సినిమాలో బాల‌కృష్ణ రెండు డిఫ‌రెంట్ లుక్స్‌లో క‌న‌ప‌డతారని హింట్ ఇచ్చారు.

మొన్న వినాయక చవితికి విడుద‌లైన ఓ లుక్‌కి ప్రేక్ష‌కుల నుండి మంచి స్పంద‌న వ‌చ్చింది. ఈ సినిమాకి ఇంకా పేరు పెట్ట లేదు, రూలర్ అనే టైటిల్ రిజిస్టర్ చేసి ఉండడంతో అదే పేరు పెడతారు అని భావిస్తున్నారు. అయితే టైటిల్ తో పాటు ఈ సినిమా టీజర్ ను కూడా దసరాకి విడుదల చేయచ్చని చెబుతున్నారు.  సోనాల్‌ చౌహాన్‌, వేదిక హీరోయిన్స్‌ గా నటిస్తున్న ఈ సినిమాలో ప్రకాశ్‌ రాజ్‌, జయసుధ, భూమిక చావ్లా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. చిరంత‌న్ భ‌ట్‌ సంగీతం అందిస్తోన్న ఈ సినిమా మీద అంచనాలను పెంచే విధంగా ఆ టీజర్ ఉంటుందని చెబుతున్నారు. మొత్తానికి టైటిల్ కూడా చెప్పకుండా ఒకేసారి టీజర్ అంటే బాలయ్య అభిమానులకి పండగనే చెప్పాలి. 

More Related Stories