బాలకృష్ణ ఇంకెప్పటికీ మారతాడు.. ఇంకా మారడా..nbk
2019-12-21 06:52:44

ఈ ప్రశ్న మనం అడుగుతున్నది కాదు అభిమానులే అడుగుతున్నారు. తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో మార్పులు వస్తున్నాయి కానీ బాలకృష్ణలో మాత్రం మార్పులు రావడం లేదు అంటూ అభిమానులు నిట్టూరుస్తున్నారు. తాజాగా ఆయన నటించిన రూలర్ సినిమా విడుదలైంది. కె.ఎస్.రవికుమార్ తెరకెక్కిన ఈ చిత్రానికి నెగిటివ్ టాక్ వచ్చింది. అసలు ఇందులో ఏ పాయింట్ చూసి బాలకృష్ణ ఈ సినిమా ఓకే చేసాడు అంటూ తలపట్టుకుంటున్నారు అభిమానులు. జై సింహా సినిమాలో కనీసం ఎమోషన్స్ ఉన్నాయి.. రొటీన్ కథే అయినా కూడా మాస్ ఆడియన్స్ ను మెప్పించే కొన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు కె.ఎస్.రవికుమార్. కానీ ఆ సినిమా ఇచ్చిన ఓవర్ కాన్ఫిడెన్స్ ఏమో కానీ రూలర్ సినిమాలో మాత్రం అవి ఏవీ కనిపించలేదు. పైగా సినిమాను ఇష్టమొచ్చినట్టు తీశాడు ఈ తమిళ దర్శకుడు. బాలకృష్ణ ఇమేజ్ తో ఆడుకున్నాడు.

ఇప్పుడు ఇదే అభిమానులకు కాలిపోతుంది. తమ హీరోని వచ్చినట్లు చూపించాడు అంటూ కె.ఎస్.రవికుమార్ పై మండి పడుతున్నారు నందమూరి బాలకృష్ణ అభిమానులు. ఓపెనింగ్ సీన్ లోనే హెలికాప్టర్ పై నుంచి వేలాడటం.. మధ్యలో జబర్దస్త్ కమెడియన్ లతో వెకిలి కామెడీ చేయించడం.. తలా తోక లేని యాక్షన్ సన్నివేశాలు ఇవన్నీ చూసి ప్రేక్షకుల మాట దేవుడెరుగు అభిమానులు కూడా నిరాశ పడుతున్నారు. కనీసం వాళ్ల కైనా నచ్చేలా తీయడంలో కె.ఎస్.రవికుమార్ దారుణంగా విఫలమయ్యాడు అంటున్నారు విశ్లేషకులు. ఇప్పటికైనా బాలకృష్ణ కథల ఎంపికలో తన పంథా మార్చుకోవాలని లేకపోతే ఇలాంటి దారుణమైన ఫలితాలే మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతాయి అంటున్నారు ట్రేడ్ పండితులు. ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో ఒక సినిమా కమిట్ అయ్యాడు.

More Related Stories