వారసుడి విషయంలో బాలయ్య కంగారు పడుతున్నాడా.. అదే శాపం.. Balakrishna
2020-09-11 00:55:03

అదేంటి మోక్షజ్ఞ ఉన్నాడు కదా.. అలాంటప్పుడు వారసత్వం లేకపోవడం ఏంటి అనుకుంటున్నారా.. కానీ బాలయ్య విషయంలో ఇప్పుడు ఇదే జరుగుతుంది. ఇండస్ట్రీలో జరుగుతున్న విషయాలు బాలయ్యకు తెలియకపోవడం వెనక వారసత్వం కూడా ఉందనే ఆసక్తికరమైన నిజాలు కొన్ని బయటికి వస్తున్నాయి. ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. మొన్నటికి మొన్న ఇండస్ట్రీలో జరిగిన మీటింగ్స్ కు చిరంజీవి నాగార్జున సురేష్ బాబు లాంటి వాళ్ళు వచ్చారు. కాస్త లోతుగా ఆలోచిస్తే అందులో చాలా విషయాలు బయట పడుతున్నాయి. ఇండస్ట్రీలో ఉన్న దర్శక నిర్మాతలు చిరంజీవి, నాగార్జున లాంటి వాళ్ళ వెనక పడటానికి ప్రధాన కారణం వాళ్ల వారసత్వమే. మెగా ఫ్యామిలీలో దాదాపు అరడజను పైగా స్టార్ హీరోలు ఉన్నారు. చిరంజీవిని ప్రసన్నం చేసుకుంటే ఎవరో ఒకరితో సినిమా చేసే అవకాశం ఆ దర్శకుడితో లేదంటే నిర్మాతకు ఉంటుంది. అలాగే నాగార్జున కూడా అఖిల్ నాగచైతన్య వారసులున్నారు. వాళ్ళ మార్కెట్ ఎలా ఉన్నా కూడా వాళ్లతో సినిమాలు చేసుకునే అవకాశం వస్తుంది.

ఇక సురేష్ బాబుకు వెంకటేష్ రానా దగ్గుబాటి ఉన్నారు. అందుకే ఆయన కూడా మీటింగ్ విషయంలో అందరికంటే ముందున్నాడు. కానీ బాలకృష్ణ విషయంలో అలా లేదు. పైగా నందమూరి వంశంలో జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఇలాంటి సమయంలో కూడా బాబాయ్ పక్కన నిలబడలేదు. ఒకవేళ నిజంగా బాలయ్యకు ఎన్టీఆర్ బలంగా నిల్చుంటే కచ్చితంగా పరిస్థితి మరోలా ఉండేదని విశ్లేషకులు అంటున్నారు. ఇలాంటి సమయంలో బాలయ్య ఒంటరి కావడం.. మోక్షజ్ఞ సినిమాలకు దూరంగా ఉండటంతో ఆయనను కూడా ఇండస్ట్రీలో కొందరు దూరం పెడుతున్నారు. ఒకవేళ మోక్షజ్ఞ సినిమాలు చేసి ఉంటే కచ్చితంగా ఆ వారసత్వం పేరుతో బాలయ్యను కూడా అందరూ పిలిచేవాళ్ళు అంటున్నారు విశ్లేషకులు. ఏదేమైనా కూడా కొడుకు సినిమాలు చేసి హీరోగా నిలబడే వరకు బాలయ్యకు ఈ కష్టాలు తప్పకపోవచ్చు. 

More Related Stories