బాలయ్య నెక్ట్స్ మూవీ గురించి ఇంట్రస్టింగ్ అప్ డేట్.Balayya Next movie update
2021-08-21 05:17:24

నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం అఖండ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతోన్న అఖండ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ సినిమా షూటింగ్ ను త్వరలో పూర్తి చేసి.. రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇవ్వనున్నారని వార్తలు వస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం... వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ లో రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. దసరా కానుకగా అక్టోబర్ లో అఖండ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. 

ఇదిలా ఉంటే.. అఖండ తర్వాత బాలయ్య.. క్రాక్ మూవీ డైరెక్టర్ మలినేని గోపీచంద్ తో సినిమా చేయనున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్లో మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. కొన్ని యధార్థ సంఘటనలు ఆధారంగా ఈ సినిమాను మలినేని గోపీచంద్ తెరకెక్కించనున్నారు. అయితే.. ఈ సినిమాను ఎప్పుడు సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు అనేది అఫిషియల్ గా అనౌన్స్ చేయలేదు కానీ.. ఈ సినిమా షూటింగ్ ను అక్టోబర్ 1 న పట్టాలెక్కించే ఏర్పాట్లు చేస్తున్నారని తెలిసింది.

హీరోయిన్ ఎవరు అనేది ఇంకా ఫైనల్ కాలేదు. త్వరలోనే హీరోయిన్ తో పాటు మిగిలిన నటీనటులను ఎంపిక చేయనున్నారు. అక్టోబర్ లో షూటింగ్ ను మొదలు పెట్టి కేవలం నాలుగు నెలల్లోనే షూటింగ్ ను ముగించేయాలని దర్శకుడు గోపీచంద్ మలినేని భావిస్తున్నాడట. 2022 సమ్మర్ కి ఈ సినిమాను భారీ స్ధాయిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. క్రాక్ మూవీతో ఫామ్ లోకి వచ్చిన మలినేని గోపీచంద్.. బాలయ్య సినిమాతో మరో సక్సస్ సాధిస్తాడేమో చూడాలి మరి.
 

More Related Stories