ఆ సినిమాతో మోక్షాజ్ఞ ఎంట్రీ..క్లారిటీ ఇచ్చిన బాల‌య్య‌Balayya
2021-06-11 23:32:20

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌య్య బ‌ర్త్ డే సంద‌ర్భంగా అభిమానుల‌కు గుడ్ న్యూస్ చెప్పారు. ఎప్ప‌టినుండో నంద‌మూరి అభిమానులు బాల‌య్య కొడుకు మోక్షాగ్ఞ ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్న సంగ‌తి తెలిసిందే. కానీ మోక్షాజ్క్షకు సినిమాల‌పై ఆస‌క్తి లేదని....అందువ‌ల్లే సినిమాల‌కు దూరంగా ఉంటున్నాడ‌ని. సినిమాల్లోకి వ‌చ్చే అవ‌కాశం లేద‌ని ప‌లు ర‌కాల వార్త‌లు వ‌చ్చాయి. కానీ తాజాగా బాల‌య్య ఆయ‌న బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఇచ్చిన ఇంట‌ర్యూలో అవ‌న్నీ పుకార్లేన‌ని కొట్టిపారేసారు. ఆదిత్య 369 సినిమా సీక్వెల్ తో మోక్షజ్ఞ ఎంట్రీ ఉండ‌బోతుందంటూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేశారు. 

త‌నకు త‌న తండ్రి న‌ట‌న‌లో మెలుకువ‌లు నేర్పించార‌ని...ప‌లు సినిమాల్లో ఆయ‌నకు తండ్రి మెలుకువ‌లు నేర్పించార‌ని అలాగే తాను కూడా త‌న కుమారుడితో క‌లిసి ఆదిత్య 369 లో నటించి న‌ట‌న‌లో మెలుకువ‌లు నేర్పుస్తాన‌ని అన్నారు. అంతే కాకుండా ఈ సినిమాకు తాను లేదంటే సింగీతం శ్రీనివాస‌రావు ద‌ర్శ‌క‌త్వం వ‌హించే అవ‌కాశం ఉంద‌ని తెలిపారు. అంతే కాకుండా న‌ర్త‌నశాల సినిమా గురించి మాట్లాడుతూ సౌంద‌ర్య బ‌తికుంటే ఆ సినిమా పూర్త‌య్యేద‌ని చెప్పారు. ద్రౌప‌తి పాత్ర‌లో వేరే వాళ్ల‌ను ఊహించుకోలేన‌ని అందుకే ఆ సినిమాను భ‌విష్య‌త్తులో కూడా తెర‌కెక్కించే అవ‌కాశం లేదన్నారు. 
 

More Related Stories