బాల‌కృష్ణ తొలి టాక్ షో దీపావ‌ళి సంద‌ర్భంగా న‌వంబ‌ర్ 4న ప్రసారం.Balayya Talk show Details
2021-10-28 04:17:22

100 పర్సెంట్ తెలుగు మాధ్యమంగా ‘ఆహా’ తిరుగులేని ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను అందిస్తూ ప్ర‌తి తెలుగువారి ఇంట్లో భాగ‌మైంది. అలాంటి మ‌న తెలుగు ఓటీటీ ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌సార‌మైన టాక్ షోస్ అన్నింటి రూల్స్‌ను మార్చి రాసేలా స‌రికొత్త టాక్ షో ‘అన్ స్టాప‌బుల్ విత్ ఎన్‌.బి.కె’తో మ‌న ముందుకు రాబోతుంది. ఈ టాక్‌షోతో టాలీవుడ్ అగ్ర క‌థానాయ‌కుడైన న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ డిజిట‌ల్ ఎంట్రీ ఇస్తున్నారు. ఆయ‌న హోస్ట్ చేస్తున్న తొలి టాక్ షో ఇది. ఈ షోలో ఎన‌ర్జీ, టాక్‌షోలోని ఉత్సాహాన్ని మ‌రెక్క‌డా చూసుండ‌ర‌నే మాట నిజం.

లార్జ‌ర్ దేన్ లైఫ్ ఓరాతో ఎంగేజింగ్‌, ఎంట‌ర్‌టైనింగ్‌, ఎమోష‌న‌ల్ రైడ్‌లా భారీ కాన్వాస్‌ పై బాప్ ఆప్ ఆల్ టాక్ షోస్‌గా ఈ టాక్‌ షో నిలుస్తుంద‌న‌డంలో సందేహ‌మే లేదు. అన్‌స్టాప‌బుల్ ఎన్‌.బి.కెలో నంద‌మూరి బాల‌కృష్ణ ఎవ‌రికీ సాధ్యం కానీ త‌న‌దైన స్టైల్లో తెలుగు చిత్ర‌సీమలోని అతి పెద్ద స్టార్స్‌తో మ‌న‌సు విప్పి మాట్లాడ‌బోతున్నారు. ఈ సినీ సెల‌బ్రిటీల‌కు సంబంధించి ఎవ‌రికీ తెలియ‌ని ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను ఈ షో ద్వారా తెలియ‌జేయ‌బోతున్నారు. ఈ టాక్‌షోలో తొలి ఎపిసోడ్ ఆహాలో దీపావ‌ళి సంద‌ర్భంగా న‌వంబ‌ర్ 4 సాయంత్రం నుంచి ప్ర‌సారం కానుంది. ఈ విష‌యాన్ని బుధ‌వారం బాల‌కృష్ణ, ‘ఆహా’ ఫేస్ బుక్ లైవ్ ద్వారా తెలియజేస్తూ సాయంత్రం 5 గంట‌ల 5 నిమిషాల‌కు ప్రోమోను విడుద‌ల చేశారు. ఈ షోకు సంబంధించి ప్రేక్ష‌కులు ఎలాంటి అంచ‌నాల‌తో అయితే ఎదురుచూస్తున్నారో అలాంటి ఈ ప్రోమోలో బాల‌కృష్ణ స‌రికొత్త లుక్‌తో క‌నిపిస్తున్నారు. ఇందులో ఆయ‌న ఓ ఫ్యాన్సీ బైక్ నుంచి ల‌గ్జ‌రీ కారు, అక్క‌డి నుంచి గుర్రం పై స్వారీ చేస్తూ క‌న‌ప‌డుతున్నారు. ఈ ప్రోమో చూస్తుంటే ఆయ‌న తిరుగులేని ఎన‌ర్జీతో ఈ షోను హోస్ట్ చేయ‌బోతున్నార‌ని అర్థ‌మ‌వుతుంది.

మాట‌ల్లో ఫిల్టర్ ఉండ‌దు. స‌ర‌దాలో స్టాప్ ఉండ‌దు. సై అంటే సై, నై అంటే నై(ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను అందించ‌డంలో ఎలాంటి అడ్డు ఉండ‌ద‌నే అర్థం) అంటూ త‌న‌దైన పంథాలో మాట‌ల‌తో ఆయ‌న ప్రోమోలో గ‌ర్జించారు. ఆయ‌న ఎన‌ర్జీ ఎలాగైతే తిరుగులేకుండా ఎవ‌రూ ఆప‌లేని విధంగా అజేయంగా ఉంటుందో అన్‌స్టాప‌బుల్ విత్ ఎన్.బి.కె కూడా అంతే నిజాయ‌తీగా, ఎన‌ర్జిటిక్‌గా, రియ‌ల్‌, భావోద్వేగాల‌తో అనూహ్యంగా ఉండ‌బోతోంది. ఈ షో ఎలా ఉండ‌బోతుంద‌నే విష‌యాన్ని ఈ ప్రోమో తెలియ‌జేస్తోంది. ఇదెంతో ఎగ్జ‌యిట్‌మెంట్‌గా ఉంది. ఇది క‌చ్చితంగా ప్రేక్ష‌కుల‌కు స్క్రీన్స్‌కు క‌ట్టిప‌డేస్తుంది.

దీపావ‌ళి పండుగ సీజ‌న్‌లో ప్రేక్ష‌కుల‌కు ఎగ్జ‌యిట్‌మెంట్‌ను క‌లిగించే ఎన్నో ఒరిజిన‌ల్ వెబ్ సిరీస్‌లు.. బిడ్డంగ్ నేప‌థ్యంలో ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్న‌డూ లేని స‌రికొత్త గేమ్ షో ‘స‌ర్కార్‌’ను ప్ర‌దీప్ మాచిరాజు హోస్ట్ చేస్తున్నారు. అలాగే ఆర్కా మీడియా రూపొందించిన ‘అన్యాస్ టూటోరియ‌ల్’, మారుతి ‘త్రీ రోజెస్’ , ప్రియమ‌ణి, రాజేంద్ర ప్ర‌సాద్ న‌టించిన ఒరిజిన‌ల్ ఫిల్మ్ ‘భామా క‌లాపం’తో పాటు 2021లో తెలుగులో బిగ్గెస్ట్ హిట్ మూవీగా నిలిచిన ‘లవ్‌స్టోరి’, క్రాక్, జాంబిరెడ్డి, నాంది, చావు కబురు చల్లగా వంటి చిత్రాలతో పాటు కుడి ఎడమైతే, లెవన్త్ అవర్, తరగతిదాటి, ది బేకర్ అండ్ ది బ్యూటీ వంటి ఒరిజినల్స్‌తో తెలుగు వారింట సందడి చేయనుంది ‘ఆహా’.
 

More Related Stories