పవర్ స్టార్ ట్రైలర్ అందుకే డిస్ లైక్ చేయలేదంటున్న బండ్ల గణేష్..Bandla Ganesh
2020-07-27 08:15:40

తెలుగు ఇండస్ట్రీలో నిర్మాత బండ్ల గణేష్ కు ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈయన 20 ఏళ్ల నట ప్రస్థానంలో కమెడియన్ గా సాధించిన గుర్తింపు కంటే..  కేవలం రెండు మూడు సినిమాలు నిర్మించి తెచ్చుకున్న గుర్తింపు ఎక్కువ. అందులోనూ మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ విషయంలో బండ్ల గణేష్ చేసే కొన్ని కామెంట్స్ ఆయనను ప్రత్యేకంగా ఉండేలా చేశాయి. ఆయన పవన్ కళ్యాణ్ కు తనను తాను భక్తుడిగా చెప్పుకుంటాడు. పవర్ స్టార్ ఏం చేసినా తప్పు లేదు అంటాడు బండ్ల గణేష్. 

ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ పై వర్మ సెటైరికల్ గా తీసిన ''పవర్ స్టార్'' మూవీ ట్రైలర్ ని బండ్ల గణేష్ లైక్ చేయడం సంచలనంగా మారింది. ఆ తర్వాత వెంటనే స్పందించిన ఈయన.. తనకు తెలియకుండా అలా జరిగిపోయిందని.. క్షమించాలి అంటూ అభిమానులు కోరుకున్నాడు. అయినా కూడా బండ్ల గణేష్ తో పవన్ అభిమానులు ఆడుకుంటున్నారు. దాంతో మరోసారి ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు ఈ నిర్మాత.

తనకు టెక్నాలజీ మీద అంత పరిజ్ఞానం లేదని.. ట్విట్టర్ అలా చూస్తూ వెళ్తుంటే లైక్ కొట్టినట్టు పడిందని చెప్పుకొచ్చాడు బండ్ల గణేష్. అదే సమయంలో రోడ్డు మీద ఓ వ్యక్తికి యాక్సిడెంట్ అవడంతో అతనికి సాయం చేసే క్రమంలో ఈ ట్రైలర్ కు లైక్ కొట్టిన సంగతి కూడా మరిచిపోయినట్టు చెప్పాడు. ఆ తర్వాత ఏదో తెలియక జరిగిన పొరపాటని వాళ్ళకి క్షమాపణ చెప్పానని తెలిపాడు బండ్ల గణేష్. అయితే తనకు డిస్ లైక్ కొట్టడం తెలియదని చెప్పాడు ఈ నిర్మాత. ఒకవేళ డిస్ లైక్ కొడితే లైక్ అనేది పోతుందని తనకు తెలియదని చెప్పాడు బండ్ల గణేష్.

తాను చెప్పేది నిజమా అబద్దమా అని నిరూపించుకోవాల్సిన అవసరం తనకు లేదు అంటున్నాడు ఈయన. అంతే కాకుండా యాక్ట్ చేయాల్సిన అవసరం తనకు లేదని.. లైక్ కొట్టినా రీ ట్వీట్ చేసినా చేశానని చెప్తానని.. నేను ఎవరి దయా దాక్షణ్యాల మీద బ్రతకడం లేదు.. ఎవరో కొడతారో తిడతారో అని అబద్దాలు చెప్పాలిన అవసరం లేదని.. బండ్ల గణేష్ కి ఓ క్యారక్టర్ ఉంది.. దాని మీద తాను బ్రతుకుతాను అని చెప్పుకొచ్చాడు. ఏదేమైనా కూడా తెలిసి చేసాడో తెలియక చేశాడో తెలియదు కానీ పవర్ స్టార్ ట్రైలర్ విషయంలో బండ్ల గణేష్ మాత్రం అడ్డంగా దొరికిపోయాడు.

More Related Stories