అల్లుడు అదుర్స్ రిలీజ్ డేట్ ఫిక్స్ Bellmakonda Sai Sreenivas
2021-01-11 15:59:46

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న సినిమా "అల్లుడు అదుర్స్". ఈ సినిమాకు సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. గొర్రెల సుబ్రహ్మణ్యం సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో సాయి శ్రీనివాస్ సరసన నబా నటేష్, అనూ ఇమాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అంతే కాకుండా  రియల్ హీరో సోనూ సూద్ ఈ చిత్రంలో ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. మరోవైపు బిగ్ బాస్ బ్యూటీ మోనాల్ గజ్జర్ కూడా సినిమాలో ఐటెమ్ సాంగ్ లో స్టెప్పులేసింది. ఇక ఈ సినిమాను సంక్రాంతి బరిలో దింపుతామని చిత్రయూనిట్ ఎప్పటినుండో చెప్పుకొస్తుంది. 

కానీ షూటింగ్ ఆలస్యం అయినందున సంక్రాంతికి విడుదల అవుతుందా లేదా అని అంతా అనుమానం వ్యక్తం  చేశారు. కానీ చిత్ర బృందం మాత్రం చెప్పినట్టుగానే చేస్తోంది. అల్లుడిని సంక్రాంతి బరిలోకి దింపుతోంది. తాజాగా రిలీజ్ డేట్ ను కూడా కన్ఫామ్ చేసింది. ఈనెల 14న సినిమాను విడుదల చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించింది. అంతే కాకుండా ఈ సినిమాలోని "నదిలా నదిలా" అనే పాట లిరికల్ వీడియోను ఈరోజు సాయంత్రం 5:30 నిమిషాలకు విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది. సినిమాకు దేవిశ్రీప్రసాద్ స్వరాలు సమకూర్చారు. ఇక ఇప్పటికే విడుదలైన ట్రైలర్ పై మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. మరి సినిమా ఏ మేరకు విజయం సాధిస్తుందో చూడాలి.
 

More Related Stories