క్లైమాక్స్ కు చేరిన RRR..రామ్ భీమ్ ల ప్రాక్టీస్ సెషన్



RRR
2021-02-05 17:51:55

రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా "ఆర్ఆర్ఆర్". ఈ సినిమాలో రామ్ చరణ్ ,ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్నారు. చిత్రంలో చరణ్ సరసన బాలీవుడ్ భామ అలియా భట్..ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ఒవీలియా నటిస్తున్నారు. ఇక ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. చిత్రం లోని ప్రధానమైన ఇంటర్వెల్ బ్యాంగ్ తొ పాటు రామరాజు, కొమురం  భీమ్ ఎంట్రీ, క్లైమాస్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. అయితే ఏ షూట్ గ్యాప్ లో రెస్ట్ తీసుకుంటున్న రామ్ చరణ్, ఎన్టీఆర్ ల కాండీడ్ ఫోటోలను రాజమౌలి సోషల్ మీడియాలో షేర్ చేసాడు. ఈ ఫోటోలకు క్లైమాస్ కోసం సాగుతున్న కఠినమైన ప్రాక్టీస్ సెషన్ మధ్యలో అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఫొటోలో చరణ్ ఎన్టీఆర్ లు కూల్ గా నవ్వుతూ కనిపిస్తున్నారు. 

ఇక ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతాన్నాయి. అటు చెర్రీ అభిమానులు..ఇటు ఎన్టీఆర్ అభిమానులు తమ హీరోల ఫోటోలు చూసి ముచ్చట పడుతున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమాను అక్టోబర్ 13న విడుదల చేయబోతున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. సినిమా నుండి విడుదలైన. టీజర్, ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా ఉండటంతో సినిమాపై భారీ అంచనలునున్నాయి. మరి జక్కన్న ఆ అంచనాలను రీచ్ అవుతారో లేదో చూడాలి.

More Related Stories