పది రోజులు దాటినా దుమ్ముదులుపుతున్న భీష్మ Bheeshma
2020-03-04 17:32:07

హీరో నితిన్ నటించిన తాజా చిత్రం భీష్మ దుమ్ము రేపుతోంది. శివరాత్రి రోజున అంటే ఫిబ్రవరి 21న విడుదలైన ఈ సినిమా మొదటి ఆట నుండే మంచి టాక్ సొంతం చేసుకుంది. చలో ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నితిన్, రష్మిక మందన్న జంటగా నటించారు. ఒక్క్కమాటలో చెప్పాలంటే త్రివిక్రమ్ అ..ఆ.. తర్వాత నితిన్ కు హిట్ లేదు. లై, ఛల్ మోహన్ రంగ, శ్రీనివాస కల్యాణం సినిమాలు వరుసగా దెబ్బ వేశాయి.

అయితే నితిన్ కరువు మొత్తాన్ని ఈ సినిమా తీర్చేసింది. భీష్మ సినిమా తొలి వారంలోనే బ్రేక్ ఈవెన్ సాధించి ఆ తరువాత నుండి లాభాలను అందుకోవడం మొదలు పెట్టింది. ఇక 10 రోజులు పూర్తయ్యే సరికి ఈ సినిమాకి మంచి కలెక్షన్స్ నమోదయ్యాయి. అనూహ్యంగా ఈ సినిమా కొన్న అన్ని ఏరియాల బయ్యర్లు లాభాలు అందుకుంటున్నారు. 10 రోజుల్లో భీష్మ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 26.28 కోట్ల షేర్ రాబట్టిట్టు ట్రేడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం.

ఒక్కతెలుగు రాష్ట్రాల్లో భీష్మ చిత్రం 21.30 కోట్ల షేర్ రాబట్టిందని అంటున్నారు. ఇక ఓవర్సీస్ లో కూడా సినిమా మిలియన్ డాలర్ మార్క్ కు చేరువలో ఉందని అంటున్నారు. హిట్ వంటి సినిమా పడినా నితిన్ కి గత క్రేజ్ దృష్ట్యా ఇంకా ఈ సినిమా థియేటర్స్ లో ఆడుతుందని అంటున్నారు. చూడాలి మరి ఈ సినిమా లాంగ్ రన్ లో ఎన్ని అద్భుతాలు సృష్టిస్తుంది అనేది.  

More Related Stories