భీష్మ ఫస్ట్ డే కలెక్షన్స్.. అ..ఆ రికార్డు తిరగరాసిన నితిన్..Bheeshma
2020-02-22 11:35:04

పెళ్లికి ముందు నితిన్ కు మరో శుభవార్త. మూడేళ్లుగా ఒక్క విజయం కూడా లేని హీరో సరిగ్గా నిశ్చితార్థం చేసుకున్న వారం రోజుల్లోనే బ్లాక్ బస్టర్ అందుకుంటున్నాడు. శ్రీనివాస కళ్యాణం తర్వాత ఏడాదిన్నర నుంచి ఎలాంటి సినిమాలు చేయని నితిన్ భీష్మ సినిమాతో పాజిటివ్ టాక్ తెచ్చుకున్నాడు. వెంకీ కుడుముల తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయం దిశగా అడుగులు వేస్తోంది. తొలిరోజు రాష్ట్రాల్లోనే 6.30 కోట్ల షేర్ వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా 7.50 కోట్లకు పైగానే తీసుకువచ్చింది. నితిన్ కెరీర్లో ఇప్పటివరకు బిగ్గెస్ట్ ఓపెనింగ్ తీసుకొచ్చిన సినిమా ఇదే. నైజాంలో ఏకంగా రెండు కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది భీష్మ. అన్ని ఏరియాల్లో రిపోర్ట్స్ ఉండటంతో హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతున్నాడు నితిన్.

త్రివిక్రమ్ తెరకెక్కించిన అ..ఆ సినిమాతో నాలుగేళ్ల కిందట తొలిరోజు తెలుగు రాష్ట్రాల్లో ఐదున్నర కోట్లకి పైగా షేర్ తీసుకొచ్చాడు నితిన్. ఆ తర్వాత వచ్చిన ఏ సినిమా కూడా ఈ రికార్డు అందుకోలేదు. ఇప్పుడు భీష్మ సినిమాతో త్రివిక్రమ్ రికార్డులను తిరగరాశాడు ఈ కుర్రహీరో. నాలుగేళ్ల కిందట నితిన్ కష్టాల్లో ఉన్నప్పుడు గురువు త్రివిక్రమ్ వచ్చి ఆదుకుంటే ఇప్పుడు మళ్లీ వరుస ఫ్లాపుల్లో ఉన్నప్పుడు ఆయన శిష్యుడు వచ్చి నితిన్ కోరుకున్న విజయాన్ని అందించాడు. రెండో రోజు కూడా అన్ని చోట్ల హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో భీష్మ దుమ్ము దులిపేస్తున్నాడు. బాక్సాఫీస్ దగ్గర మరో సినిమా కూడా లేకపోవడం దీనికి బాగా కలిసొస్తుంది. ఎటు చూసుకున్న కూడా 30 కోట్లకు పైగా షేర్ వసూలు చేసేలా కనిపిస్తుంది భీష్మ.

More Related Stories