బాలీవుడ్ కి వెళ్తున్న మరో తెలుగు సినిమాanu
2019-10-24 07:55:48

ప్రస్తుతం అన్ని బాషలలో బయో పిక్స్ కి ఎంత క్రేజ్ ఉందో...ఇతర బాషలలో సూపర్ హిట్ అయిన సినిమాలను రీమేక్ చేయడం కూడా అంతే జరుగుతోంది. అయితే ఒకప్పుడు బాలీవుడ్ సినిమాలను దక్షిణాది బాషలలోకి రీమేక్స్ చేసేవారు, కానీ కాలక్రమేణా అది దక్షిణాది నుండి బాలీవుడ్ అన్నట్టు సాగుతోంది. బాహుబలి సూపర్ హిట్ తర్వాత అనుష్క చేసిన సినిమా భాగమతి. థ్రిల్లర్ జోనర్ లో వచ్చిన ఈ సినిమా మొత్తాన్ని వన్ మ్యాన్ ఆర్మీ అన్నట్టు నిలబడింది. సినిమా బాగా ఆడింది. బాహుబలి క్రేజ్ అని చెప్పాలో అనుష్క సత్తా అని చెప్పాలో తెలీదు కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది.

ఏకంగా 40 కోట్ల వరకూ షేర్ రాబట్టి అనుష్క కి మార్కెట్ ఉందని నిరూపించింది. అప్పట్లో ఈ మూవీకి సీక్వెల్ ఉంటుందనే వార్తలు కూడా వచ్చాయి. కానీ కానీ దర్శకుడి కంటే హీరోయిన్ తో పాటు ఇతర టెక్నీషియన్స్ కు ఎక్కువ పేరు రావడంతో దర్శకుడు డిజప్పాయింట్ అయ్యాడట. అందుకే ఈ సినిమాని బాలీవుడ్ లో రీమేక్ చేయబోతున్నారని సమాచారం. టాలెంటెడ్ నటిగా ఈ మధ్య కాలంలో పేరు తెచ్చుకున్న భామ భూమీ ఫెడ్నేకర్ అనుష్క పాత్రలో కనిపించబోతోందని అంటున్నారు.

భూమీ ఇంతకు ముందు ధమ్ లగా కే ఐసా, టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథా వంటి సినిమాలతో, లస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్ తో మంచి పేరు తెచ్చుకుంది. టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథా నిర్మించిన వారే ఈ బాలీవుడ్ భాగమతి రీమేక్ కి కూడా నిర్మాతలుగా వ్యవహరించానున్నారట. అశోక్ ప్రస్తుతం మంజులతో కలిసి వెబ్ సిరీస్ తీస్తున్నారు, అది ఈ డిసెంబర్ కి పూర్తి అవుతుందట. అది అయిపోగానే ఈ సినిమా పట్టాలెక్కనుందని అంటున్నారు.  

 

More Related Stories