శ్రీముఖి మీద తప్పుడు ప్రచారం అంటూ పోలీస్ కేస్..srimukhi
2019-08-30 11:44:42

శ్రీముఖి పై తప్పుడు వార్తలు రాస్తున్నారంటూ ఓ ఇంగ్లీష్ పేపర్‌పై ఆమె సోదరుడు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ట్విట్టర్‌ లో నకిలీ అకౌంట్ల ద్వారా పెట్టే పోస్టుల ఆధారంగా ప్రముఖ ఆంగ్ల మీడియా ఒకటి వార్తలు రాస్తుందని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్స్‌ ద్వారా జరుగుతున్న ప్రచారాన్ని పరిగణలోకి తీసుకుని ఆ పత్రిక శ్రీముఖిపై అసత్య ప్రచారానికి పూనుకుందని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై మొదట సైలెంట్ గా ఉన్నా రోజు ఆ పత్రిక శ్రీముఖిపై మరింత వ్యతిరేక కథనాలను వ్యాప్తి చేస్తుండటంతో పోలీసులను ఆశ్రయించక తప్పలేదని ఆయన చెబుతున్నారు. 

శ్రీముఖి ప్రస్తుతం బిగ్‌ బాస్ -3 లో కంటెస్టెంట్ గా ఉన్నారు. శ్రీముఖి ఇమేజ్ డ్యామేజ్ చేసి ఆమె ఓటింగ్ శాతాన్ని తగ్గించడానికే ఇలాంటి పెయిడ్ మీడియా పనిచేస్తుందని ఆమె సోదరుడు శుష్రుత్ ఆరోపించారు. బిగ్‌బాస్ లో గత ఎపిసోడ్‌లో రాహుల్ సిప్లిగంజ్‌ను 'బ్లాక్ షీప్' అంటూ శ్రీముఖి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. రాహుల్‌ పట్ల శ్రీముఖి వర్ణ వివక్ష చూపిస్తోందంటూ సోషల్ మీడియాలో నెటిజెన్స్ విమర్శించారు. దీనినే హైలైట్ చేస్తూ సదరు వెబ్ సియట్ పత్రిక కథనాన్ని ప్రచురించగా దానినే బేస్ చేసుకుని శ్రీముఖిపై అసత్య ప్రచారం చేస్తున్నారంటూ ఆమె సోదరుడు పోలీసులను ఆశ్రయించడం చర్చనీయాంశంగా మారింది.  

More Related Stories