ఆచార్య సినిమాలో మెహబూబ్ కు అవకాశం Acharya Mehboob
2020-12-28 18:23:17

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో "ఆచార్య" సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా కారణంగా వాయిదా పడిన ఈ సినిమా షూటింగ్ ను మళ్ళీ ప్రారంభించారు. సినిమాలో కాజల్ అగర్వాల్ చిరుకి జంటగా నటిస్తోంది. అంతే కాకుండా సినిమాలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో దేవలయాలపై జరుగుతున్న అవకతవకల పై ఎండోమెంట్ విభాగంలో ఉద్యోగం చేస్తున్న చిరు పోరాటం చేయనున్నాడు. ఇదిలా ఉండగా ఈ సినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ వార్త చక్కర్లు కొడుతోంది. ఇటీవల ముగిసిన బిగ్ బాస్ సీజన్ 4 లోని కంటెస్టెంట్ మెహబూబ్ కు ఈ సినిమాలో అవకాశం ఇస్తున్నారట. మెగాస్టార్ సినిమాలో ఓ చిన్న పాత్రకోసం మెహబూబ్ ను తీసుకోవాలని కొరటాలకు చెప్పారట. ఇక ఈ వార్త ఎంతవరకు నిజమో  దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేవరకు ఆగాల్సిందే. ఇక చిరు ఇప్పటికే బిగ్ బాస్ ఫినాలే లో మెహబూబ్ కు ఇళ్లు కట్టుకోవడం కోసం 10 లక్షల రూపాయలు సహాయం చేసారు. ఇప్పడు మరో అవకాశం ఇస్తూ మెహబూబ్ కు లైఫ్ ఇస్తున్నారు.


 

More Related Stories