బిగ్ బాస్ హౌస్ లో ఒంటరి అయిపోతున్న అఖిల్..Bigg Boss 4 Telugu
2020-10-19 15:23:20

మీ ఇంటితో పాటు ఈ ఇంటిపై కూడా ఒక కన్నేసి ఉంచండి అంటూ నాగార్జున చెబితే నిజంగానే కన్నేస్తున్నారు మన ప్రేక్షకులు. అందుకే రేటింగ్ కూడా బాగా వస్తోంది. మరీ ముఖ్యంగా ఈ సారి బిగ్ బాస్ హౌస్ లో తెలిసినవారు పెద్దగా లేకపోయినా కూడా వాళ్ళు చేసే టాస్కులతో ప్రేక్షకులకు బాగా దగ్గరవుతున్నారు. ఈ క్రమంలోనే ఇంట్లో కొందరు కంటెస్టెంట్ లు బయట భారీగా క్రేజ్ తెచ్చుకున్నారు. అందులో అఖిల్ కూడా ఉన్నాడు. బిగ్ బాస్ కి రాకముందు ఈయన ఎవరో ఎవరికీ పెద్దగా తెలియదు. కానీ అక్కడికి వచ్చిన తర్వాత హీరోయిన్ మోనాల్ తో మనోడు నడిపిస్తున్న కథ బాగా ఆసక్తికరంగా మారిపోయింది. మరోవైపు ఆ అమ్మాయి కూడా అఖిల్ తో పాటు అభిజిత్ తోనూ సన్నిహితంగా ఉంటుంది. కానీ అఖిల్ మాత్రం కేవలం మోనాల్ తోనే చాలా క్లోజ్ గా ఉంటున్నాడు. ఆమె కోసం మిగిలిన వారిని దూరం చేసుకుంటున్నాడు. నిజానికి కో మొదలైనప్పుడు అఖిల్, అభిజీత్ మంచి స్నేహితులుగా ఉన్నారు. రెండో వారం వరకు వాళ్ళ మధ్య రిలేషన్ బాగానే ఉంది. ఎప్పుడు అయితే మోనాల్ వారిద్దరి మధ్య వచ్చింది అప్పటి నుంచి ఇద్దరి మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. అప్పట్నుంచి అతనితో మాట్లాడటం మానేశాడు అఖిల్. ఆ తర్వాత కూడా ఇద్దరి మధ్య వార్ కంటిన్యూ అవుతూనే ఉంది. 

ప్రతి వారం నామినేషన్స్ టైంలో ఇద్దరూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటారు. ఈ విషయంలో నాగార్జున వాళ్లకు సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చాడు. అయినా కూడా వీళ్ళు ఇద్దరి పద్ధతి మారలేదు. ఇదిలా ఉంటే మిగిలిన వాళ్ళతో కూడా అంటీ ముట్టనట్లుగానే ఉంటున్నాడు అఖిల్. ఇదే ఆయనను ఇంట్లో మిగిలిన సభ్యులకు దూరంగా ఉండేలా చేస్తుంది. కేవలం ఒక అమ్మాయి కోసం మిగిలిన వాళ్ళు అందరినీ దూరం చేసుకుంటూ ఒంటరిగా మారిపోతున్నాడని నెటిజన్లు కామెంట్లు కూడా చేస్తున్నారు. ఈ విషయంలో మిగిలిన ఇంటి సభ్యులు చెప్పినా కూడా వినే పరిస్థితుల్లో అఖిల్ ప్రస్తుతం లేడు. మరి ఏం జరుగుతుందో చూడాలి. 

More Related Stories