రాహుల్ పెళ్లి అయిపోయిందా...సైలెన్స్ దేనికి సంకేతం ?rahul
2020-05-24 10:34:42

సోషల్ మీడియాలో ఇప్పుడు ఆసక్తికర చర్చ నడుస్తోంది. అదేంటంటే సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కు పెళ్లి అయిందా ? ఎవరికి తెలియకుండా ఆయన పెళ్లి చేసుకున్నాడా ? అనే చర్చ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే బిగ్ బాస్ లో పునర్నవి, రాహుల్ మధ్య జరిగిన కెమిస్ట్రీ పెద్ద చర్చనీయాంశంగా మారింది. అయితే రాహుల్ కి ఏకైక సన్నిహితుడిగా పేరున్న సింగర్ నోయల్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంటూ శుభాకాంక్షలు చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బిగ్‌బాస్ మూడో సీజన్‌ లో జరిగిన కెమిస్ట్రీని బట్టి పునర్నవి, రాహుల్ ప్రేమ, పెళ్లి గురించి లెక్కలేనన్ని వార్తలు వచ్చేవి. అయితే బయటకొచ్చాక రాహుల్‌ పునర్నవినే కాదు ఎవరిని ఇష్టపడ్డా ఆమెతోనే వివాహం జరిపిస్తామని ఆయన తల్లిదండ్రులు పేర్కొనడం కూడా ఈ వార్తలకి ఊతం ఇచ్చింది. అయితే రాహుల్-పునర్నవిలు తాము కేవలం మంచి స్నేహితులమేనని ఎన్నోసార్లు క్లారిటీ ఇచ్చారు.

అయితే ఇప్పుడు ఏమయిందో ఏమో కానీ తాజాగా రాహుల్ ఇంట్లో సింగర్ నోయెల్, వరుణ్, వితికా, మరి కొంత మంది స్నేహితులు రాహుల్ ఇంట్లో సందడిగా గడిపిన ఫోటోలు అప్లోడ్ చేశారు. హ్యాపీ మ్యారిడ్ లైఫ్..ఈ విషయంలో నాకు చాలా సంతోషంగా ఉందని నోయల్ చేసిన కామెంట్ క్షణాల్లో వైరల్ అయింది. అయితే రాహుల్ సిప్లిగంజ్ పెళ్లి గురించి సోషల్ మీడియాలో ఇంత చర్చ జరుగుతున్నా.. రాహుల్ మాత్రం ఈ విషయంపై స్పందించక పోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికైనా రాహుల్ తన పెళ్లి విషయం పై స్పష్టత ఇవ్వాలని అభిమానులు కోరుతున్నా ఆయన స్పందించడం లేదు. దీంతో ఇది నిజమేనేమో అని కొందరు కామెంట్ చేస్తున్నారు.  

 

More Related Stories