బిగ్ బాస్ నామినేషన్స్ లో అభిజిత్ తో సహా ఆ నలుగురు



Bigg Boss Telugu 4
2020-11-30 11:21:23

బిగ్ బాస్ తెలుగు సీజన్-4 ముగింపు దశకు చేరుకుంది. పన్నెండో వారం పూర్తి చేసుకుని పదమూడో వారంలోకి అడుగుపెట్టింది. ఇక సోమవారం నామినేషన్స్ ప్రక్రియ మొదలవడంతో హౌస్ లో మళ్ళీ హీటు పెరిగింది. సోమవారం జరిగిన ఎపిసోడ్ కు సంబందించిన ప్రోమో వచ్చేసింది. ప్రోమోలో నామినేషన్స్ కు సంబందించిన సన్నీ వేషాలను చూపించారు. కాగా  ఈ సారి నామినేషన్ ప్రక్రియలో బిగ్ బాస్ హౌస్ మేట్స్ కలర్ ట్యూబ్స్ మేడలో వేసుకుని తాము నామినేట్ చేయాలనుకుంటున్న ఇంటి సభ్యుల కంటెయినర్స్ లో కలర్ వాటర్ పోయాల్సి ఉంటుంది. 

అయితే సోమవారం ప్రోమోలో హారిక అభిజిత్ కంటెయినర్ లో కలర్ వాటర్ పోసి నామినేట్ చేసినట్టు కనిపిస్తోంది. అభిజిత్ బిగ్ బాస్ ఇచ్చిన మోనాల్ తో డేట్ టాస్క్ ని నిరాకరించిన రీజన్ చెప్పి హారిక తో పాటు మిగిలిన ఇంటిసభ్యులు కూడా అభిజిత్ ను నామినేట్ చేసినట్టు తెలుస్తోంది. దాంతో ఈ వారం అభిజిత్ నామినేషన్స్ లో ఉన్నారు. ఇక అభిజిత్ తో పాటు ఈ వారం హారిక, అఖిల్ సార్థక్, మోనాల్, అవినాష్ కూడా నామినేషన్స్ లోకి వచ్చినట్టు సమాచారం. ఇక ఈ వారం సోహెల్, అరియనా లు నామినేషన్స్ నుండి సేవ్ అయినట్టు తెలుస్తోంది.      

More Related Stories