బిగ్ బాస్ నుంచి ఈ వారం ఇద్దరు ఔట్.. Bigg Boss telugu
2019-10-19 17:53:18

బిగ్ బాస్ 3 చూస్తుండగానే చివరిదశకు వచ్చేసింది. మరో రెండు వారాలు అయితే ఈ షోకు శుభం కార్డ్ పడనుంది. ఇన్నాళ్లుగా ఇంట్లో ఉండటంతో ఒకరిపై ఒకరికి తెలియకుండానే అనుబంధం ఏర్పడింది. అయితే ఒక్కో వారం ఇంటి నుంచి బయటికి వచ్చే ప్రక్రియ మాత్రం ఆగదు కదా. ఇప్పుడు ఈ వారం కూడా ఇదే జరగబోతుంది. రెండు వారాలే ఉంది.. ఇంట్లో 7 గురు ఉన్నారు. దాంతో ఇద్దర్ని ఈ సారి ఇంటి నుంచి బయటికి పంపేస్తున్నారని ప్రచారం జరుగుతుంది. అందులో ఒకరు వితిక ఎలిమినేషన్ కన్ఫర్మ అని తెలుస్తుండగా.. మరొకరు లేడీ కంటెస్టెంట్ అంటున్నారు. ఇంట్లో ప్రస్తుతం బాబా భాస్కర్, వరుణ్ సందేశ్, రాహుల్, అలీ రెజా మేల్ కంటెస్టెంట్స్ కాగా.. శ్రీముఖి, వితిక, శివ జ్యోతి ఫీమేల్ కంటెస్టెంట్స్. ఈ వారం వితికతో పాటు ఇంటికి చేరబోయే వారు ఎవరనేది ఆసక్తికరంగా మారింది.  శ్రీముఖికి బయట టైటిల్ విన్నింగ్ అనే పేరుంది. పైగా తొలి రెండు సీజన్స్ కూడా అబ్బాయిలకే టైటిల్స్ ఇవ్వడంతో ఈ సారి శ్రీముఖికి ఇస్తారని తెలుస్తుంది. మొత్తానికి ఈ సారి ఇద్దరు.. ఎలిమినేట్ అయితే ఐదుగురుతో చివరివారంలోకి ఎంట్రీ కానున్నాడు బిగ్ బాస్. మరో రెండు వారాల్లో టైటిల్ విన్నర్ ఎవరో తేలనుంది. అంతా శ్రీముఖి అని ఫిక్సైపోతున్నారు. ఆమెకు ఉన్న క్రేజ్.. పాపులారిటీ దీనికి ఉపయోగపడుతుంది. మరి చూడాలిక.. ఏం జరగబోతుందో..? 

More Related Stories