బిగ్ బాస్ సోహైల్ సినిమా షురూ



 Bigg boss
2021-03-03 18:31:54

జార్జ్ రెడ్డి, ప్రజర్ కుక్కర్ లాంటి సినిమాలతో విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్న నిర్మాత‌ అప్పిరెడ్డి బిగ్ బాస్ ఫేం సోహెల్ తో సినిమాను ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకు కొత్త దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. కాగా తాజాగా ఈసినిమా పూజా కార్యక్రమాలతో లాంఛ‌నంగా ప్రారంభమైంది. ఈ సంద‌ర్భంగా నిర్మాత అప్పిరెడ్డి మాట్లాడుతూ.. ‘‘మా మైక్ మూవీ నుండి ‘‘జార్జి రెడ్డి’’ , ‘‘ప్రెషర్ కుక్కర్’’ వంటి మూవీస్ తీశాం అవి ఎంత పెద్ద హిట్ అయ్యాయో అందరికీ తెలిసిందే. 

ఇప్పుడు మూడవ సినిమాను కొత్త డైరెక్టర్ శ్రీనివాస్ వింజనంపాటి తో కలసి బిగ్ బాస్ ఫేం సోహైల్ హీరోగా ఓ క్రేజీ ప్రాజెక్ట్ చేస్తున్నామ‌న్నారు. ఇప్పటివరకు భారతదేశ చిత్ర చరిత్రలో రాని ఓ కొత్త పాయింట్ తో ఈ సినిమా ఉంటుందన్నారు. అంతే కాకుండా భారీ బడ్జెట్ తో సినిమాను నిర్మిస్తున్న‌ట్టు చెప్పారు. ఈ సినిమాకు చాలా మంది టాలెంటెడ్ టెక్నీషియన్లు పనిచేస్తున్నారని అన్నారు. అతి త్వరలో రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని, మిగతా వివరాలు త్వరలో తెలియజేస్తామ‌ని అన్నారు. ఇక బిగ్ బాస్ షోతో ఫుల్ పాపులారిటీ సంపాధించుకున్న సోహెల్ త‌న హీరోగా అల‌రిస్తారా లేదా చూడాలి. 

More Related Stories