ప్ర‌భాస్ సినిమాలో బిగ్ బాస్ టైటిల్ విన్న‌ర్



Adipurush
2021-05-15 17:51:48

ప్రభాస్ హీరోగా నటిస్తున్న క్రేజీ చిత్రాల్లో ఆది పురుష్ సినిమా ఒకటి. ఈ సినిమాకు బాలీవుడ్  దర్శకుడు ఓంరౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. పౌరాణిక గాథ రామాయణం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో ప్రభాస్ కు విలన్ గా రావన్ పాత్రలో సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. అంతే కాకుండా సినిమాలో సీతగా బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ నటిస్తోంది. అయితే తాజాగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో కీలక పాత్రల్లో బిగ్ బాస్ విన్నర్ నటించబోతున్నారట. అయితే అతడు మన తెలుగు బిగ్ బాస్ విన్నర్ కాదండి. బాలీవుడ్ బిగ్ బాస్ విన్నర్ గా నిలిచిన సిద్దార్థ్ శుక్లా ఆది పురుష్ సినిమాలో నటించబోతున్నారట. ఈ చిత్రంలో మేగ నాథుడు పాత్రలో సిద్ధార్థ్ శుక్లా నటించబోతున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా సిద్దార్థ్ శుక్లా బిగ్ బాస్ హౌస్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అంతే కాకుండా తన ఆటిట్యూడ్ తో ప్రేక్షకులను ఆకట్టుకుని టైటిల్ విన్నర్ గా నిలిచాడు. ప్రస్తుతం శుక్లా బ్రోకెన్ బట్ బ్యూటిఫుల్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. ఇప్పుడు ఏకంగా బిగ్ బాస్ తో వచ్చిన క్రేజ్ తో పాన్ ఇండియా ప్రాజెక్టులోనే ఛాన్స్ కొట్టేసాడు.

More Related Stories