బిగిల్ బెనిఫిట్ షోలు రద్దు...భీబత్సం సృష్టించిన విజయ్ ఫ్యాన్స్ Bigil
2019-10-25 09:33:13

దీపావళి సందర్భంగా విజయ్ హీరోగా నటించిన బిగిల్ చిత్రం ఈరోజు విడుదల కానుండడంతో తమిళనాడు వ్యాప్తంగా సందడి వాతావరనం నెలకొంది. విజయ్ అభిమానులు అయితే నిన్న రాత్రి నుండే థియేటర్స్ వద్ద సందడి చేస్తున్నారు. అట్లీ - విజయ్ కాంబినేషన్ లో గతంలో వచ్చిన తేరి, మెర్సల్ సూపర్ హిట్స్ కావడంతో బిగిల్ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. అయితే ఈరోజు సినిమా విడుదల అనగా నిన్న తమిళనాడు ప్రభుత్వం విజయ్ ఫ్యాన్స్ కి షాకిచ్చింది. బిగిల్ మూవీ ప్రత్యేక షోలకు అనుమతిని నిరాకరించింది. పైగా టికెట్స్ రేట్లపై కూడా ఆంక్షలు విధించింది. 

బిగిల్ చిత్ర ప్రత్యేక షోలకు అనుమతి లేదని తమిళనాడు మంత్రి ఒకరు స్వయంగా ప్రకటించారు. నిజానికి ఎప్పటి నుండో విజయ్, తమిళ నాడు ప్రభుత్వం మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది. గతంలో కూడా విజయ్ సినిమాలకి అక్కడి ప్రభుత్వం ఇబ్బందులు సృష్టించింది. ఇక తాజాగా బిగిల్ కి కూడా అంతే చేసింది ప్రభుత్వం. బిగిల్ చిత్ర ప్రత్యేక షోల కోసం టికెట్స్ ని అత్యధిక ధరకు విక్రయిస్తున్నారని పేర్కొన్న మంత్రి అందుకే ఈ బెనిఫిట్ షోలు ఆపెస్తున్నామని ప్రకటించారు. 

షోలు లేవు కాబట్టి ప్రేక్షకులకు టికెట్ల డబ్బు తిరిగి ఇచ్చేయాలని ఆదేశించారు. అయితే తమ అభిమాన హీరో సినిమా బెనిఫిట్ షో ప్రదర్శించలేదని అభిమానుల ఆగ్రహం మరోసారి కట్టలు తెచ్చుకుంటోంది. షోని ప్రదర్శించలేదని అభిమానులు ఆగ్రహంతో రోడ్ల మీదకి వచ్చి రచ్చ చేశారు. దీంతో వారిని అదుపు చేయడానికి పోలీసులు చాలా సేపు కష్టపడ్డారు. పోలీస్, మున్సిపల్ వాహనాలను కూడా ధ్వంసం చేశారు. అలాగే సినిమా హాల్ దగ్గరలో ఉన్న షాపులకు, వాహనాలకు నిప్పు పెట్టారు. దీంతో పరిస్థితి చేదాటి పోవడంతో పోలీసులు లాఠీ ఛార్జ్ చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు.

More Related Stories