బ్లాక్ మనీ రివ్యూ రేటింగ్mohanlal-block money
2017-04-21 19:02:20

మోహన్ లాల్ కి తెలుగు ప్రేక్షకులకి మద్య దూరాన్ని జనతా గ్యారేజ్, మన్యంపులి సినిమాలు తగ్గించాయి. ఏటువంటి పాత్రలో అయినా ఇమిడిపోయేఈ  స్టార్ ఈ సారి వీడియో జర్నిలిస్ట్ గా తెలుగు ప్రేక్షకులముందుకు బ్లాక్ మనీ మూవీ తో వచ్చాడు. బ్లాక్ మనీ ఎలాంటి ఇంపాక్ట్ ని క్రియేట్ చేసిందో చూద్దాం..

కథ: రాయిటర్స్ లో స్ట్రింగర్ గా పనిచేసే వేణు(మోహన్ లాల్) ఒక కేసు విషయమై ఢిల్లీనుండి హైదరాబాద్ వస్తాడు. అక్కడ ఒక న్యూస్ కవరేజ్ కి వెళ్ళిన వేణుకి రేణు కనిపిస్తుంది(అమలాపాల్). తన ఫ్రెండ్ ఒక న్యూస్ ఛానల్ పెడుతున్న సందర్భంలో ఒక సెన్సేషనల్ న్యూస్ తో ఛానల్ లాంఛ్ చేద్దామనుకొని ఒక మంత్రి లంచం తీసుకుంటుండగా పట్టుకునేందుకు ఒక ప్లాన్ వేస్తారు. ఆ ప్లాన్ ప్రకారం ఆ లంచం ఎపిసోడ్ ని చిత్రీకరించి వేణు ఆ ఫూటేజ్ ని రేణుకిస్తాడు. అయితే ఆ ఫూటేజ్ ని వేరే ఛానల్ లో టెలికాస్ట్ అవుతుంది. దీంతో ప్రేమించుకొని పెళ్ళి కి రెడీ అయిన వీరు ఈ గొడవతో విడిపోతారు. ఒక లైవ్ మర్డర్ ని చిత్రీకరించే పనిలో రేణుతో కలసి పనిచేయాల్సి వస్తుంది. ఆ తర్వాత ఆ ఇన్సిడెంట్ తో వీరి జీవితాలు ప్రమాదంలో పడతాయి. లైవ్ మర్డర్ అని టెలికాస్ట్ చేసిన సంఘటన ఫేక్ అని ఆ వ్యక్తి బతకే ఉన్నాడని తెలుస్తుంది. మరి వేణు, రేణు ఈ సంఘటనుండి ఎలా బయటపడతారు..? అసలు వీరిని ఈ కేసులో ఇరికించింది ఎవరనేది మిగిలిన కథ..?

కథనం : ఏదైనా బ్యాక్ డ్రాప్ తీసుకొని సినిమా చేయాలంటే చాలా సినిమాలలో అందుకు సంబందించిన రీసెర్చ్ చాలా తక్కువుగా కనిపిస్తుంది. కేవలం వారికి తెలసిన సమాచారానికి మరికాస్త ఊహాజనితమైన సమాచారాన్ని నింపి తెరపై రుద్దుతారు. కానీ బ్లాక్ మనీ సినిమా చూస్తున్న వారికి మీడియా పై వీరు చేసిన రీసెర్చ్ చాలా సర్ ప్రైజింగ్ గా అనిపించింది. మీడియా హౌస్ లు నడిచే తీరును క్షుణ్ణంగా పరిశీలించి సినిమా గా మలచడం లో దర్శకుడు జోషి వందశాతం సక్సెస్ అయ్యాడు. ఇక మోహన్ లాల్ తన పాత్రలో ఇమిడిపోయాడు. తన ఇమేజ్ ని ఏమాత్రం పట్టించుకోకుండా పాత్ర పరిథులను అర్ధం చేసుకొని తెరపై ప్రవర్తించాడు. సినిమాకి ప్రధాన బలం మోహన్ లాల్ అనే చెప్పాలి. ఎందుకంటే వేణు పాత్రలో ఉండే ఎమోషన్స్ ని చక్కగా పలికంచాడు. మీడియాలో జరిగే స్ట్రింగ్ ఆపరేషన్స్ ని  చాలా ఆసక్తికరంగా తెరపై చూపించాడు. అమలా పాల్ గ్రే క్యారెక్టర్  ని చక్కగా చేసింది.

ఒక నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ కి అమల పూర్తి న్యాయం చేసింది. ఛానల్స్ మద్యనుండే పోటీతో పాటు, ఛానల్స్ ఉద్యోగల జీతాలు జీవితాలు గురించి ఒక్క సీన్ లో చెప్పేసాడు దర్శకుడు జోషి. అలాగే మీడియా కుండే పవర్ ని అండర్ ప్లే చేస్తూ కథను నడపించడంలో సక్సెస్ అయ్యాడు. మోహన్ లాల్ ప్రెండ్ గా బిజుమీన్ పాత్ర చాలా ఎంటర్ టైనింగ్ ఉంటుంది. అమలా పాల్ అండ్ మోహన్ లాల్ మద్య వచ్చే గిల్లి కజ్జాలు సరదాగాసాగుతాయి. ఇక ప్రీ క్లైమాక్స్ నుండి కథ మరింత గ్రిప్పింగ్ సాగుతుంది. తనచుట్టూ బిగుసుకున్న ఉచ్చును తప్పించుకునేందుకు హీరో ఆడే గేమ్ ఉత్కంఠభరితంగా సాగింది. తన పాత్ర లోనే ఉంటూ హీరో చూపించే హీరోయిజం తప్పకుండా ఆకట్టుకుంటుంది. మోహన్ లాల్ మరో గ్రిప్పింగ్ పాత్రతో ఆకట్టుకున్నాడు. అయితే డబ్బింగ్ సినిమా కాబట్టి సెకండాఫ్ లో వచ్చే సన్నివేశాలలలో నేటివ్ టచ్ పోవడంతో కథను పక్కద్రోవ పట్టినట్లనిపిస్తుంది. మోహన్ లాల్ సినిమా అంతా తన బుజాలపై మోసాడు. అమలాపాల్ పాత్ర కూడా సస్పెక్ట్ గా ఉంటూ ఎంగేజ్ చేసింది. మీడియా బ్యాక్ డ్రాప్ లో వచ్చిన బెస్ట్ థ్రిల్లర్ గా బ్లాక్ మనీ నిలుస్తుంది. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ ని బాగా డీల్ చేసాడు దర్శకుడు. ఇప్పడు కేవలం వినోదం కోసం సినిమాలకు వచ్చే ప్రేక్షకుల శాతం తగ్గిపోయింది.  ఒక సీరియస్ కంటెంట్ ని గ్రిప్పింగ్ ప్రజెంట్ చేయగల సినిమాలు ప్రేక్షకదారణ  పొందుతున్నాయి. ఈ మారుతున్న ట్రెండ్ కి బ్లాక్ మనీ మరో ఎగ్జాంపుల్ గా నిలుస్తుంది.

చివరిగా : థ్రిల్ చేసిన మోహన్ లాల్ 

Rating : 3/5

More Related Stories