సౌత్ సినిమాల్లో అతిధి పాత్రలు చేసిన బాలీవుడ్ ప్రముఖులు.. Bollywood actors
2020-05-14 17:55:17

బాలీవుడ్ స్టార్స్ అంటే నిర్మాతలు భరించలేని వాళ్ళు అని అర్థం. ఎందుకంటే వాళ్ళు తీసుకునే పారితోషకాలు అలా ఉంటాయి. అక్కడ వాళ్ళు ఒక సినిమాకి తీసుకునే రెమ్యునరేషన్ తో సౌత్ లో ఒక సినిమా తీసేయొచ్చు. అందుకే బాలీవుడ్ స్టార్స్ వైపు అడుగులు వేయరు. కానీ అప్పుడప్పుడు కొందరు హీరో హీరోయిన్లు మాత్రం తమకు సౌత్ లో ఉన్న పరిచయాలతో కొన్ని సినిమాల్లో అతిథి పాత్రలు చేస్తుంటారు. అలా ఇప్పటి వరకు చాలా అరుదుగా మాత్రమే దక్షిణాది సినిమాల్లో అతిథి పాత్రలు పోషించారు. అలాంటి వారిలో ముందుగా చెప్పుకోవాల్సింది అమితాబ్ బచ్చన్ గురించి. నాగార్జునతో తనకున్న సాన్నిహిత్యం కారణంగా మనం సినిమాలో కేవలం ఒక నిమిషం పాటు స్క్రీన్ పై కనిపించాడు బిగ్ బి. ఆ తర్వాత చిరంజీవి హీరోగా వచ్చిన సైరా నరసింహారెడ్డిలో కూడా ఉయ్యాలవాడ గురువు పాత్రలో నటించాడు. బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్.. రజనీకాంత్ హీరోగా వచ్చిన టు 2.0లో విలన్ గా నటించాడు. తమిళనాడు ధనుష్ హీరోగా నటించిన విఐపి2 సినిమాలో కాజోల్ ప్రతినాయక పాత్ర పోషించింది. ఇక గతేడాది బాలకృష్ణ హీరోగా క్రిష్ తెరకెక్కిన ఎన్టీఆర్ బయోపిక్ లో బాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ విద్యాబాలన్ నటించింది. ఇలా అప్పుడప్పుడూ కథలు నచ్చి కొందరు పరిచయాల వల్ల మరికొందరు సౌత్ సినిమాల్లో అలా మెరిసి వెళ్తుంటారు.
 

More Related Stories