ఎక్కడి 4000 కోట్లు.. ఎక్కడి 400 కోట్లు.. కరోనాతో బాలీవుడ్ ఢమాల్..



Bollywood
2021-04-01 08:07:47

కరోనా వైరస్ కారణంగా ఇప్పటికే ఇండస్ట్రీ వేల కోట్లు నష్టపోయింది. తెలుగు హిందీ తమిళం అనే తేడా లేకుండా ప్రతి ఇండస్ట్రీ కూడా ఈ వైరస్ కారణంగా ఇప్పటికే దాదాపు 10 వేల కోట్లు నష్టపోయిందని అంచనా. అందులో బాలీవుడ్ ఏకంగా 5000 కోట్లు నష్టపోయింది. ఏటా అక్కడ ఎన్ని సినిమాలు విడుదల అవుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందులో స్టార్ హీరోల సినిమాలు దాదాపు 500 కోట్ల నుంచి 750 కోట్ల వరకు వసూలు చేస్తున్నాయి. కానీ ఈ వైరస్ కారణంగా గత రెండేళ్లుగా అక్కడ సినిమాలు విడుదల కావడం లేదు. 2019లో 4000 కోట్ల బిజినెస్ జరిగింది. అదే 2020 సంవత్సరంలో కేవలం 400 కోట్ల బిజినెస్ మాత్రమే జరిగింది. దానికి కారణం వైరస్. ఇప్పటికీ ఈ వైరస్ కారణంగా సినిమాలు విడుదల కావడం లేదు. 

2021 తొలి మూడు నెలల్లో బాలీవుడ్ పెద్దగా విజయాలు చూడలేదు. వచ్చిన సినిమాలు పెద్దగా వసూలు చేయలేదు. ఇదిలా ఉంటే ఇప్పుడు మహారాష్ట్ర కరోనా కేసుల్లో అన్నింటికంటే ముందు ఉంది. అక్కడ రోజుకు 30 వేల కేసులు వస్తున్నాయి. దాంతో మళ్లీ లాక్ డౌన్ దిశగా అడుగులు వేస్తుంది ప్రభుత్వం. అంటే సినిమాలు మళ్లీ విడుదల కావు అన్నమాట. ఇప్పటికే తమ సినిమాలను కొన్ని వాయిదా వేసుకున్నారు దర్శక నిర్మాతలు. ఏప్రిల్ 30న విడుదల కావాల్సిన అక్షయ్ కుమార్ సూర్య వంశీ ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. దాంతో పాటు ఇంకా చాలా సినిమాలు విడుదల కావాల్సి ఉన్నాయి. అయితే ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే థియేటర్ల వరకూ ప్రేక్షకులు వస్తారా రారా అనేది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలోనే వేల కోట్లు నష్టపోతుంది బాలీవుడ్.

More Related Stories