బన్నీకి బాలీవుడ్ విలన్స్...టెన్షన్ లో ఫ్యాన్స్allu
2020-04-12 12:06:30

బాలీవుడ్ నుండి విలన్స్ ని తెచ్చి మనోళ్ళని భయపెట్టే రోజులు పోయాయి. ఇప్పుడు ఏకంగా అక్కడి హీరోలను తెచ్చి ఇక్కడ విలన్స్ చేసేస్తున్నారు మనోళ్ళు. అసలు విషయంలోకి వెళ్తే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా లెక్కల దర్శకుడు సుకుమార్ డైరక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా పుష్ప. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. మొట్టమొదటిసారి అల్లు అర్జున్ సినిమాని పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేస్తున్నారు. మూవీగా పుష్ప వస్తుంది. అందుకే అన్ని బాషల నటీనటులను రోప్ చేస్తున్నారని అంటున్నారు. సరిగ్గా సైరా, సాహోలకి చేసినట్టుగానే. ఇప్పటికే సినిమాలో బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌతేలాతో స్పెషల్ సాంగ్ ప్లాన్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతుండగా విలన్స్ గా సంజయ్ దత్ ,సునీల్ శెట్టి, జాకీ ష్రాఫ్ పేర్లు పరిశీలనలో ఉన్నాయని సమాచారం.

తమిళ హీరో విజయ్ సేతుపతి పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారని అంటున్నారు. రాయల సీమ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ మూవీ కి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారురు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యం లో వస్తోన్న ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో రిలీజ్ కానుంది. అయితే బాలీవుడ్ వారిని రోప్ చేసే విషయంలో బన్నీ ఫ్యాన్స్ అంతగా సానుకూలంగా లేరట. ఎందుకంటే బాహుబలి తప్ప ఇలా వేరే బాషల నటులను తీసుకుని చేసిన ప్యాన్ ఇండియా మూవీ ఏదీ హిట్ కాలేదని వారు భయపడుతున్నట్టు చెబుతున్నారు. చూడాలి సుక్కూ ఏం చేస్తారో ?

 

More Related Stories