సుశాంత్ రెడ్డి బొంబాట్ టీజర్ విడుదలBombhaat
2020-11-27 18:33:47

ఈ నగరానికి ఏమైంది సినిమాతో వెండి తెరకు పరిచయమైన నటుడు సాయి సుశాంత్ రెడ్డి. సుశాంత్ మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించాడు. ఆ తరవత హీరోగా ఓ సినిమాలో నటించాడు. ఇక రెండేళ్ల గ్యాప్ తరవాత "బొంబాట్" అనే సినిమాతో సుశాంత్ ముందుకొస్తున్నాడు. సైన్స్ ఫిక్షన్ డ్రామా ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో హీరోయిన్ ఓ హ్యూమనాయిడ్ రోబో అని రోబోను హీరో ప్రేమించడంతో కథలో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయన్నది సినిమా కథ. 

ఈ సినిమాలో చాందిని చౌదరి, సిమ్రాన్ చౌదరి హీరోయిన్ లుగా నటిస్తున్నారు. బొంబాట్ సినిమాకు రఘావేంద్ర వర్మ డైరెక్షన్ చేస్తున్నారు. ఇక ప్రముఖ దర్శకుడు రాఘవేంద్ర రావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా టీజర్ విడుదలైంది. టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటిటి సంస్థ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. డిసెంబర్ 3న సినిమా అమెజాన్ ప్రైమ్ లో డిసెంబర్ 3న విడుదల కానుంది.    

More Related Stories