బ్రహ్మాజీ కుమారుడి రెండో సినిమా ‘ప్రేమిస్తే ఇంతే’ ప్రారంభంBrahmaji son second movie launched
2021-09-21 22:32:34

చక్ర ఇన్ఫోటైన్‌మెంట్ ఎల్ఎల్‌పి బ్యానర్‌ పై ప్రముఖ నటుడు బ్రహ్మాజీ తనయుడు, ‘ఓ పిట్ట కథ’ మూవీ ఫేమ్ సంజయ్ రావు హీరోగా, అనితా షిండే (తొలి పరిచయం) హీరోయిన్‌గా జై దర్శకత్వంలో నిర్మాత వెంకటరత్నం నిర్మిస్తోన్న చిత్రం ‘ప్రేమిస్తే ఇంతే’. రొమాంటిక్ లవ్ స్టోరీతో పాటు హిలేరియస్ కామెడీ డ్రామాగా తెరకెక్కనున్న ఈ చిత్రం ఇటీవల పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. అలీ, ఆర్.జె. హేమంత్, ఆర్.జె. కృష్ణ, వెంకట కిరణ్, వైవా రాఘవ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి సీఏ సిద్దార్థ్ క్లాప్ కొట్టి చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా దర్శకుడు జై మాట్లాడుతూ “సాఫ్ట్‌ వేర్ కంపెనీ నేపథ్యంలో హై ఫై లవ్ స్టోరీ బ్రాక్‌డ్రాప్‌తో ‘ప్రేమిస్తే ఇంతే’ చిత్రాన్ని తెరకెక్కించనున్నాం. సంజయ్ ఈ చిత్రంలో ఓ లవర్ బాయ్‌గా కనిపిస్తాడు. అతని పాత్ర అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది. తప్పకుండా తెలుగు ప్రేక్షకులకు ఓ మంచి చిత్రాన్ని ఇస్తాం” అన్నారు.

నిర్మాత వెంకటరత్నం మాట్లాడుతూ “దర్శకుడు జై చెప్పిన కథ చాలా బాగుంది. నేటి జనరేషన్‌కి బాగా కనెక్ట్ అవుతుంది. మా బ్యానర్‌ స్థాయిని పెంచే చిత్రమవుతుందని ఆశిస్తున్నాం. నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరి సహకారంతో ఈ చిత్రాన్నిశరవేగంగా  పూర్తి చేస్తాం, మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తాం” అని అన్నారు.
 

More Related Stories