బ్రహ్మానందం చిన్న కొడుకు సినిమాల్లోకి వస్తున్నాడా..



Brahmanandam
2020-12-23 11:29:21

టాలీవుడ్ లో టాప్ హాస్యనటుడు బ్రహ్మానందం కు ఎంత మంది కొడుకులు ఉన్నారో చాలా తక్కువ మందికి తెలుసు. పెద్ద కుమారుడు గౌతమ్ అందరికి పరిచయమే కానీ మరో కుమారుడు ఉన్నట్టు తెలీదు. ఎందుకంటే చిన్న కుమారుడు పెద్దగా భయట కనిపించడు. అతడికి అసలు ఇండస్ట్రీతో సంబంధాలు లేవు. బ్రహ్మీ చిన్న కొడుకు సిద్దార్థ్ విదేశాల్లో పెరిగాడు. ఇటీవలే ఆయన చదువులు పూర్తి చేసుకుని ఇండియా వచ్చాడు. ఈ సందర్భంగా బ్రహ్మీ అతడితో కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అతడు సినిమాల్లోకి వస్తాడా అన్న అనుమానాలు మొదలయ్యాయి. 

కానీ సిద్ధార్థ్ కు అసలు సినిమాలంటే ఇంట్రస్ట్ లేదట. అతడి ఫోకస్ అంతా బిసినెస్ పైనే ఉన్నట్టు తెలుస్తోంది. అందుకోసమే ఇంతకాలం అసలు ఇండస్ట్రీ వైపు కన్నెత్తి కూడా చూళ్ళేదట. నిజానికి సిద్ధార్థ్ కు సినిమాలపై ఆసక్తి ఉంటే బ్రహ్మికి ఇండస్ట్రీలో ఉన్న క్రేజ్ ను బట్టి ఎప్పుడో హీరోగా ఎంట్రీ ఇప్పించేవాడు. కానీ సిద్ధార్థ్ కు ఆసక్తి లేకపోవడంతోనే లైట్ తీసుకుని కొడుకుని నచ్చిన దారిలో వెళ్ళమని చెప్పాడు.  ఇక పెద్ద కొడుకు గౌతమ్ విషయానికొస్తే...పల్లకిలో పెళ్లి కూతురు సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాతో అతడికి మంచి గుర్తింపు వచ్చినప్పటికీ ఆ ఆతరవత పెద్దగా అవకాశాలు రాలేదు. ఇక ఆ తరవాత బసంతి, మను లాంటి సినిమాల్లో నటించగా బ్రహ్మీ స్టార్స్ తో ప్రమోషన్ చేయించినప్పటికి ఈ సినిమాలు కూడా పెద్దగా ఆడలేదు.

More Related Stories