బ్రేకింగ్: వాల్మీకి టైటిల్ చేంజ్..valmikititlechange.jpg
2019-09-19 22:00:14

వాల్మీకి సినిమాపై కొన్ని రోజులుగా వివాదాలు అంటుకుంటూనే ఉన్నాయి. ఇప్పుడు ఇది ఇంకా ముదిరింది. ఈ చిత్ర టైటిల్ విషయంలో కొన్ని రోజులుగా బోయ సంఘాలు రచ్చ చేస్తూనే ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ టైటిల్ మార్చాల్సిందే అని.. లేదంటే సినిమాను ఆపేస్తాం అంటూ వాళ్లు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ విషయంలో హై కోర్ట్ కూడా బోయ సంఘాలకే సపోర్ట్ చేయడంతో చిత్ర నిర్మాతలు కూడా ఏం చేయలేకపోతున్నారు. తాను ఎందుకు ఈ టైటిల్ పెట్టాల్సి వచ్చిందో వివరణ ఇచ్చుకున్నా కూడా లాభం లేకుండా పోయింది. హైకోర్టుకు యూనిట్ వివరణ ఇచ్చినా కూడా టైటిల్ మార్చాలని చెప్పడంతో వాళ్లు అదే చేసారు. బోయ హక్కుల పోరాట సమితి కోరిక మేరకే తమ సినిమా టైటిల్ ను గద్దలకొండ గణేష్ అని మార్చేసారు. ఇదే విషయంపై దర్శకుడు హరీష్ శంకర్ కూడా అర్జంట్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసాడు. ఫిల్మ్ ఛాంబర్‌లో ఈ ప్రెస్ మీట్ పెట్టాడు హరీష్. అయితే వాల్మీకి టైటిల్ ఇప్పటికే జనాల్లోకి వెళ్లిపోయింది. ఇప్పుడు మారినా కూడా అదే టైటిల్ తో అభిమానుల్లోకి వస్తున్నాడు వాల్మీకి.

More Related Stories