మరో భారీ బిజినెస్ లోకి దిగనున్న బన్నీ...Allu Arjun.jpg
2020-03-23 16:00:24

దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే సామెతను అందరూ ఎలా ఫాలో అవుతారో తెలియదు కానీ మన తెలుగు స్టార్స్ మాత్రం బాగా ఫాలో అవుతారు. ఎందుకంటే నాలుగు రాళ్ళు సంపాదిస్తున్నప్పుడే వీరు తమ డబ్బును వివిధ రూపాల్లో పెట్టుబడులు పెట్టి దానిని రెండింతలు చేసుకుంటూ ఉంటారు. ఇందులో ఎవరూ మినహాయింపు కాదు. స్టార్ నటుల నుండి చిన్నా చితకా వారి దాకా అందరూ ఈ సూత్రాన్ని ఫాలో అవుతూ ఉంటారు. తాజాగా బన్నీ ఇదే దారిలో నడుస్తున్నట్టు చెబుతున్నారు.

ఇప్పటికే మనోడు మహేష్ బాబు, ప్రభాస్ ఇన్స్పిరేషన్ తో ఒక సినిమా హాల్ నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యాడు. హైదరాబాద్ అమీర్ పెట్ లో ఫేమస్ థియేటర్ సత్యంను పడకొట్టి సినీ దిస్త్రిబ్యుషన్ లో తలపండిన మరో బయటి వ్యక్తితో కలిసి నిర్మిస్తున్నారు. ఈ వ్యాపారం కాకుండా మనోడు మరో వ్యాపారం చేసే ఆలోచనలో ఉన్నట్టు చెబుతున్నారు. అదేమిటి అంటే లగ్జరీ కార్ల బిజినెస్. ఈ బిజినెస్ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే అద్దెకు లగ్జరీ కార్లు తిప్పడం. ఇప్పటికే ముంబై, బెంగళూరు లాంటి మహా నగరాల్లో ఈ బిజినెస్ మూడు పువ్వులు ఆరు కాయలుగా నడుస్తోంది.

పెళ్ళిళ్ళకి, షూటింగ్స్ అలాగే ఇతర అవసరాల కోసం ఈ కార్లు అద్దెకు ఇస్తూ ఉంటారు. ఇప్పటికే ఈ కార్ల బిజినెస్ లో దిగిన ఒక రాజకీయ నాయకుడితో బన్నీ పార్టనర్ గా కలవనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతానికి మనోడు సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా ప్రస్తుతానికి కరోనా ఎఫెక్ట్ తో ఆగిపోయింది. 

More Related Stories