తన బయోపిక్ పై స్పందించిన గోపీనాథ్Captain GR Gopinath  Soorarai Pottru
2020-11-14 02:36:56

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన "ఆకాశమే నీ హద్దురా" సినిమా గురువారం అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది. విభిన్న పాత్రల్లో నటించి మెప్పించడం సూర్యాకు వెన్నతో పెట్టిన విద్య అణా సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాతో కూడా సూర్య తన నటనా కౌశలాన్ని ప్రూవ్ చేసుకున్నాడు. ఈ సినిమాలోని కొన్ని సీన్లతో సూర్య ప్రేక్షకులకు కంటతడి పెట్టించాడు. సినిమాకు విమర్శకులనుండి ప్రశంసలు అందాయి. ఇక ఈ సినిమాను సామాన్యుడిని విమానం ఎక్కించాలనే గొప్ప ఆశయం కలిగిన కెప్టెన్ గోపీనాథ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించారు. కాగా సినిమాపై తాజాగా గోపీనాథ్ ఓ వివరణాత్మక సమీక్ష ట్వీట్ చేశారు. అన్నిటికంటే మించి ఈ సినిమా కల్పితమైనదని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే భావోద్వేగాలకు అనుగుణంగా సినిమాను భాగా తీశారని ప్రశంసించారు. సినిమాలో సూర్య హీరోయిన్ అపర్ణ బాలమురళి భాగా నటించిందని అన్నారు. సూర్యనటన శక్తివంతంగా సాగిందని అన్నారు. కలకలను సాకారం చేసుకునేందుకు పిచ్చిగా ప్రయత్నించే వ్యక్తి పాత్రలో సూర్య ఒదిగిపోయాడని పేర్కొన్నారు. చీకటి సమయాల్లో భయటకు వచ్చిన అద్భుతమైన కథ ఇది..గొప్ప ఉత్సాహ భరితమైన కథ అనడంలో ఎలాంటి సందేహం లేదంటూ గోపీనాథ్ చిత్ర బృందాన్ని ప్రశంసించారు.

More Related Stories