టెక్కీతో అసభ్య ప్రవర్తన.. సినీ నటిపై ఫిర్యాదు radha prasanthi
2020-07-23 19:29:13

బంజారాహిల్స్ పీఎస్ లో సినీనటి రాధ ప్రశాంతి పై కేసు నమోదయింది. ఒక బిల్డింగ్ సెక్యూరిటీగా పని చేస్తున్న లక్ష్మీ అనే మహిళను రాధ ప్రశాంతి కారుతో డీ కొట్టింది. భారీ శబ్దం వినిపించడంతో త్రిష సాయి అనే మహిళా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ బయటికి వచ్చి చూసింది. సెక్యూరిటీ గార్డ్ లక్ష్మీ మీద రాధ ప్రశాంతి తో పాటు కారు లో ఉన్న మరో వ్యక్తి దాడి చేస్తుండగా సదరు ఇంజినీర్ త్రిష తన మొబైల్ లో దాడి పాల్పడుతున్న దృశ్యాలు వీడియో తీస్తుండగా అది గమనించిన నటి రాధ ప్రశాంతి అతని అనుచరుడు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ త్రిష మొబైల్ లాక్కొని ధ్వసం చేసి ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించారు. దీంతో బంజారాహిల్స్ పీఎస్ లో బాధితురాలు త్రిష సాయి ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో రాధ ప్రశాంతితో పాటు ఆమె అనుచరుడి మీద కేసు నమోదు చేసిన పోలిసులు దర్యాప్తు చేస్తున్నారు. ఒకప్పుడు ఎన్నో సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్న ఆవిడను ఇప్పుడు పట్టించుకునే నాథుడు కూడా లేడనే చెప్పాలి. గతంలో కూడా పెన్ డ్రైవ్ కేసుల్లో ఈమె హల్చల్ చేసింది.

More Related Stories