నాగబాబుపై ఓయూ పోలీస్ స్టేషన్‌లో కేసు..nagababu
2020-05-21 07:45:46

చాలా రోజుల తర్వాత మళ్లీ వివాదంలో ఇరుక్కున్నాడు నాగబాబు. ఆ మధ్య వరసగా సంచలన కామెంట్స్ చేసిన ఈయన కొన్ని రోజులుగా సైలెంట్ అయిపోయాడు. ఇక ఇప్పుడు మే 19న నాథూరాం గాడ్సే జయంతి సందర్భంగా నిజమైన దేశభక్తుడు అంటూ ఆయనపై నాగబాబు చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులకు కోపం తెప్పిస్తున్నాయి. ఇప్పటికే ఈ వ్యాఖ్యలపై విజయశాంతితో పాటు విహెచ్ లాంటి సీనియర్ నాయకులు కూడా విమర్శించారు. ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని రుద్దుతున్నాడంటూ కౌంటర్స్ వేసారు.

ఇదిలా ఉంటే ఇప్పుడు నాగబాబుపై ఓయూ పరిధిలోని పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. మహాత్మా గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా.. ఆయన గౌరవానికి భంగం కలిగించాడని.. అవమానించాడంటూ ఆయనపై కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ మానవతా రాయ్ పోలీసులకు ఫిర్యాదు చేసారు. మహాత్మా గాంధీ శాంతికి నిదర్మనమని ఆయన తెలిపాడు. అలాంటి మహాత్ముడిని కాల్చి చంపిన గాడ్సేను నాగబాబు పొగిడారని.. ఆయన నిజమైన దేశభక్తుడు అని చెప్పి గాంధీని అవమానించాడని ఆయన పేర్కొన్నాడు. అందుకే ధర్యాప్తు చేసి కేసు నమోదు చేయడమే కాకుండా శిక్షించాలని కోరాడు.. ఇక వెంటనే నాగబాబు ట్విట్టర్ ఖాతాను బ్యాన్ చేయాలని డిమాండ్ చేసాడు. మరోవైపు నాగబాబు మాత్రం తను అన్నదాంట్లో నిజాలు చూడాలంటూ కోరుతున్నాడు.

 

More Related Stories