అరుదైన వ్యాధితో బాధపడుతున్న సరైనోడు హీరోయిన్..actress
2019-10-20 16:32:23

అవును.. వినడానికి కాస్త విచిత్రంగా అనిపించినా కూడా ఇప్పుడు ఇదే నిజం. స్వయంగా ఆ ముద్దుగుమ్మ చెప్పడంతో ఆశ్చర్యపోవడం అభిమానుల వంతయింది. సరైనోడులో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు కదా.. మరి ఎవరికి ఈ సమస్య ఉంది అనుకుంటున్నారా. రకుల్ ప్రీత్ సింగ్ వరస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. కానీ అదే సినిమాలో నటించిన మరో ముద్దుగుమ్మ కేథరిన్ తెరెసాకు అనే ఒక వింత జబ్బు ఉందని ఇప్పుడు తెలిసింది. దీనివల్ల ప్రాణాలకు ఎటువంటి ప్రమాదం లేదు కానీ ఈమె ముక్కు ఎటువంటి వాసనలను గ్రహించలేదు. అది మంచి కానీ.. చెడు కానీ ఏ వాసన కూడా ఈమెకు తెలియదు. కేథరిన్ బాధపడుతున్న ఈ వ్యాధి గురించి ఇప్పటి వరకు బయటకి తెలియదు. ఉన్నట్టుండి ఇప్పుడు పెళ్లి విషయం బయటకు రావడంతో.. తన జీవితంలో పెళ్లి చేసుకోనని.. మూడు ముళ్ల బంధానికి ఏడు అడుగుల దూరంలోనే ఆగిపోతానని చెప్పింది. దానికి కారణం అడిగితే తనకు ఉన్న జబ్బు గురించి బయటకు చెప్పింది ఈ ముద్దుగుమ్మ.

ఇలాంటి అరుదైన వ్యాధితో బాధపడుతున్న తనకు పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం లేదని.. జీవితాంతం ఇలాగే మిగిలి పోతాను అని చెబుతుంది సరైనోడు హీరోయిన్ ఫామ్ లో ఉన్న సమయంలో కేథరిన్ త్రెసాకు ఇలాంటి వ్యాధి ఉందని తెలిసి అభిమానులు కూడా బాధ పడుతున్నారు. పెళ్లి పెటాకులు లేకుండా జీవితాంతం ఉండడం అనేది చిన్న విషయం కాదు. కానీ ఇలాంటి నిర్ణయం తీసుకుంది అల్లు అర్జున్ హీరోయిన్. ఈమె తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా అందులో అల్లు అర్జున్ సరసన మూడు సినిమాల్లో నటించింది. రుద్రమదేవి, ఇద్దరమ్మాయిలతో, సరైనోడు సినిమా లో అల్లు అర్జున్ తో కలిసి నటించింది కేథరిన్. ఇక ప్రస్తుతం తెలుగులో విజయ్ దేవరకొండ హీరోగా క్రాంతిమాధవ్ తెరకెక్కిస్తున్న వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో ఒక హీరోయిన్ గా నటిస్తుంది కేథరిన్ త్రెసా. ప్రస్తుతం సినిమాలు లోకంగా బతుకుతోంది ఈ ముద్దుగుమ్మ. తన వ్యాధికి ఎలాంటి చికిత్స లేదని చెబుతోంది ఈ భామ.

More Related Stories