సీబీఐకి కీలక సమాచారం ఇచ్చిన సుశాంత్ వంట మనిషి Sushant
2020-08-25 00:10:15

బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ సూసైడ్ చేసుకుని రోజులు గడుస్తున్న కొద్దీ ఆ కేసు రకరకాల మలుపులు తిరుగుతోంది. తాజాగా ఆయన గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి, ఆమె కుటుంబ సభ్యులతో పాటు మరో ఆరుగురు వ్యక్తుల మీద సీబీఐ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.  సోషల్ మీడియా అయితే ఆమె సుశాంత్ ని హత్య చేసిందన్నట్టు హైలైట్ చేస్తోంది. ఈ వ్యవహారం రాజకీయంగా కూడా తీవ్ర దుమారం రేపుతోంది. ఒకరకంగా ఈ కేసు బీహార్ vs మహారాష్ట్ర అన్నట్టు మారిపోయింది. ఈ విచారణ విషయంలో సిబిఐ చాలా సీరియస్ గా ఉంది. సిబిఐ అధికారులు ఇప్పుడు కీలక వ్యక్తులను విచారిస్తోంది. 

సుశాంత్ తో సంబంధం ఉన్న ప్రతీ ఒక్కరి మీద కూడా సిబిఐ ఫోకస్ చేసింది. ఆయన మేనేజర్ సిద్దార్థ్ పితాని, రియా చక్రవర్తి మీద సిబిఐ ఎక్కువగా ఫోకస్ చేసే అవకాశాలు కనపడుతున్నాయి. సిబిఐ కి వీరు ఇద్దరి మీద ఎక్కువగా అనుమానం ఉందని తెలుస్తుంది. వారు ఎప్పుడు సుశాంత్ ఇంటికి వచ్చారు అనేది ఆరా తీస్తుంది. వంట మనిషి వీరు ఇద్దరి గురించి కీలక సమాచారం ఇచ్చాడని తెలుస్తుంది. ఆమె వచ్చాక తనను ఇంట్లో నుండి మాన్పించిందని ఆయన స్టేట్మెంట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అంతే కాక తనకు తెలిసినంత వరకూ ఆయన ఎటువంటి మందులు వేసుకోవడం కానీ లేదా డాక్టర్ వద్దకు వెళ్ళడం కానీ జరగలేదని చెప్పినట్టు తెలుస్తోంది. 

More Related Stories