అందనంత ఎత్తులో ప్రభాస్.. CCCకి 50 లక్షల విరాళం.. prabhas
2020-03-30 20:32:06

తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం నెంబర్ వన్ అంటే ప్రభాస్ ఒక్కడేనేమో..? ఎందుకంటే ఆయన చేసే సాయాలు.. ఇచ్చే విరాళాలు కూడా అలాగే ఉన్నాయి. బాహుబలి అంటే అలాగే ఉన్నాయి ఇప్పుడు ప్రభాస్ చేస్తున్న పనులు కూడా. తాజాగా ఈయన కరోనా క్రైసిక్ ఛారిటీ కోసం ఏకంగా 50 లక్షలు విరాళం అందించాడు. రామ్ చరణ్ 30.. మహేష్ 25 లక్షలు ఇస్తే ఇప్పుడు ప్రభాస్ ఏకంగా 50 లక్షలు ఇచ్చేసాడు. దాంతో మొత్తం విరాళం 4.5 కోట్లకు చేరిపోయింది. 

పవన్ కళ్యాణ్ 2 కోట్లు విరాళం ఇస్తేనే ఆహా ఓహో అనుకున్నాం. కానీ దానికి రెండితలకు పైగానే ప్రకటించాడు ప్రభాస్. ఏకంగా 4.5 కోట్ల విరాళం ఇచ్చేసాడు బాహుబలి. ఇది చూసి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. మా హీరో అంటే ఇది అంటూ కాలర్ ఎగరేస్తున్నారు. హిందీలోనూ ప్రభాస్ కు సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. బాహుబలి తర్వాత విడుదలైన సాహో కూడా అక్కడ విజయం సాధించింది. దాంతో అక్కడి వాళ్ల కోసం కూడా ప్రధాన మంత్రి సహాయ నిధికి ఏకంగా 3 కోట్లు ఇచ్చాడు ప్రభాస్. ఇప్పుడు సినిమా కార్మికుల కోసం మరో 50 లక్షలు ఇచ్చేసాడు ఈయన. ప్రస్తుతం ఈయన ఫారెన్ షూటింగ్ నుంచి వచ్చి హోమ్ క్వారెంటైన్‌లో ఉన్నాడు. 

ఈ క్రమంలోనే కరోనా బాధితుల సహాయార్థం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధులకు చెరో 50 లక్షలు అనౌన్స్ చేసాడు. ఆ తర్వాత కొన్ని గంటలు గ్యాప్ తీసుకుని పిఎం రిలీఫ్ ఫండ్ కు ఏకంగా 3 కోట్లు ప్రకటించాడు. ఉత్తరాది ప్రేక్షకులు బాహుబలి రూపంలో తనను ఎంతగానో ఆదరించారని ప్రభాస్‌కు తెలుసు. అందుకే వాళ్ల బాగోగులను ఇప్పుడు ప్రభాస్ కూడా చూసుకుంటున్నాడు. మొత్తానికి అటు సినిమా కార్మికులతో పాటు ఇటు ఇండస్ట్రీని కూడా మాయ చేస్తున్నాడు ఈయన. 

More Related Stories