బాలీవుడ్ దిగ్గ‌జం మృతి పట్ల సంతాపం ప్రకటించిన ప్రముఖులు Dilip kumar
2021-07-07 11:39:16

బాలీవుడ్ దిగ్గ‌జం దిలీప్ కుమార్ మ‌ర‌ణ వార్త సినీ ప‌రిశ్ర‌మ‌ను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ ప్రధానితోపాటు పలువురు సినీ తారలు సోషల్‌మీడియా వేదికగా ట్వీట్లు చేశారు.

భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ దిలీప్ కుమార్ మ‌ర‌ణ వార్త‌పై దిగ్భ్రాంతి వ్య‌క్తం చేస్తూ.. దిలీప్ కుమార్ ఒక సినిమా లెజెండ్‌గా ఎప్ప‌టికీ అందరి మ‌న‌సుల‌లో చెర‌గ‌ని ముద్ర వేసుకున్నారు. ఆయ‌న అస‌మాన న‌ట‌న ఎన్నో త‌రాల‌కు ఆద‌ర్శంగా నిలుస్తుంది. దిలీప్ కుమార్ మృతి సినీ రంగానికి తీర‌ని లోటు. ఆయ‌న కుటుంబానికి, స్నేహితుల‌కు, అభిమానుల‌కు నా ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేస్తున్నాను అని మోదీ ట్వీట్ లోతెలిపారు.

భారతదేశం గర్వించదగ్గ నటుల్లో ఒకరైన దిలీప్‌కుమార్‌ మృతితో సినీ పరిశ్రమలో ఒక శకం ముగిసింది. ఆయన ఒక సినీ సంస్థ, సినీ సంపద. కొన్నేళ్లపాటు తన నటనతో ఎంతోమందిని ఆకట్టుకున్న లెజెండ్‌ మృతి బాధకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను’ - చిరంజీవి

దిలీప్ కుమార్ మృతిపై జూనియ‌ర్ ఎన్టీఆర్ కూడా స్పందించారు. ఇండియ‌న్ సినిమాకు దిలీప్ కుమార్ అందించిన సేవ‌లు వెలక‌ట్టలేనివి. మిమ్మ‌ల్ని త‌ప్ప‌క మిస్ అవుతాం. మీ ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని ప్రార్ధిస్తున్నాను అని ఎన్టీఆర్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.

‘వ్యక్తిగతంగానే కాకుండా వృత్తిపరమైన జీవితంలోనూ దిలీప్‌కుమార్‌ సర్‌తో నాకెన్నో మధుర జ్ఞాపకాలున్నాయి. ఆయన అకాల మరణం నన్ను కలచివేస్తోంది. సినిమా రంగానికి ఆయనో నిధి, టైమ్‌లెస్‌ యాక్టర్‌. ఆయన మరణ వార్తతో నా హృదయం ముక్కలైంది’ - అజయ్‌దేవ్‌గణ్‌

‘ఈ ప్రపంచానికి చాలామంది హీరోలై ఉండొచ్చు. దిలీప్‌కుమార్‌ సర్‌ మాలో స్ఫూర్తి నింపిన గొప్ప హీరో. సినీ పరిశ్రమకు చెందిన ఒక శకం ఆయనతో ముగిసిపోయింది. ఆయన కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. ఓం శాంతి’ - అక్షయ్‌కుమార్‌

More Related Stories