వ‌కీల్ సాబ్ పై సెల‌బ్రెటీల జ‌డ్జిమెంట్



Pawan Kalyan
2021-04-09 17:31:38

ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోగా న‌టించిన వ‌కీల్ సాబ్ సినిమా శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. దాంతో ఉద‌యం నుండి థియేట‌ర్ ల వ‌ద్ద హంగామా నెల‌కొంది. ఇక ఈ సినిమాకు బెనిఫిట్ షో నుండే పాజిటివ్ టాక్ వస్తోంది. కాగా సినిమా  చూసిన న‌టీన‌టులు మ‌రియు ద‌ర్శ‌కులు త‌మ అభిప్రాయాన్ని ఫ్యాన్స్ తో పంచుకుంటున్నారు. ఇక వ‌కీల్ సాబ్ గురించి ప‌లువురు  టాలీవుడ్ సెల‌బ్రెటీలు ఎమ‌న్నారో ఇప్పుడు చూద్దాం. 

వ‌ప‌న్ వీరాభిమాని యంగ్ హీరో నితిన్ వ‌కీల్ సాబ్ బ్లాక్ బ‌స్ట‌ర్..ప‌వ‌ర్ స్టార్ ఆన్..వ‌కీల్ సాబ్ టీం కు కంగ్రాట్స్ అంటూ ట్వీట్ చేశారు. నిర్మాత బండ్ల గ‌ణేష్ మాస్ కా బాప్...వ‌కీల్ సాబ్ నో వ‌ర్డ్స్ నో ఆర్గ్యుమెంట్స్ బ్లాక్ బ‌స్ట‌ర్ వ‌కీల్ సాబ్ అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు. 

ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి ఈ సినిమా ప‌వన్ క‌ల్యాణ్ కు  ప‌వ‌ర్ ఫుల్ కమ్ అని అన్నారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ వ‌న్ మ్యాన్ షో...వేణు శ్రీరామ్ రైటింగ్ మ‌రియు ద‌ర్శ‌క‌త్వం సూపర్..త‌మ‌న్ ఇచ్చిన పాట‌లు మరియు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయాయి... దిల్ రాజు మ‌రియు శిరీష్ కు కంగ్రాట్స్ అంటూ అనిల్ రావిపూడి త‌న స్టైల్ లో జ‌డ్జిమెంట్ ఇచ్చారు. 

ద‌ర్శ‌కుడు క్రిష్ త‌న ట్వీట్ లో వ‌కీల్ సాబ్ ను అద్భుతంగా తెర‌కెక్కించార‌ని అన్నారు. ప్ర‌తి ఒక్క‌రి న‌ట‌న రిచ్ గా ఉంద‌ని పేర్కొన్నారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న పాత్రకు ప్రాణం పోశార‌ని అభినందించారు. అంతే కాకుండా ఇలాంటి పాత్ర‌లో న‌టించిన ప‌వ‌న్ క‌ల్యాణ్ గ్రేట్ అని అన్నారు. ద‌ర్శ‌కుడు వేణు శ్రీరామ్ కు మ‌రియు నిర్మాత దిల్ రాజుకు కంగ్రాట్స్ చెప్పారు. 

అంతే కాకుండా ద‌ర్శ‌కుడు గోపీచంద్ మలినేని త‌న ట్వీట్ లో సినిమా సూప‌ర్ గా ఉంద‌ని పేర్కొన్నారు. ఇక ద‌ర్శ‌కుడు సుకుమార్ నేరుగా వేణు శ్రీరామ్ ను క‌లిసి అభినందించారు. హ‌రీష్ శంక‌ర్ త‌న ట్వీట్ లో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ప‌ర్ఫామెన్స్ తో వ‌కీల్ సాబ్ ఫెంటాస్టిక్ గా ఉంద‌న్నారు. ఇలాంటి మంచి సినిమాను తీసిన ద‌ర్శ‌కుడు వేణు శ్రీరామ్ ను అభినందించారు. అంతే కాకుండా సినిమాకు చ‌క్క‌టి డైలాగులు రాసిన తిరుప‌తిని అభినందించారు. అంతే కాకుండా టీం మొత్తానికి కంగ్రాట్స్ చెప్పారు. 

More Related Stories