వర్మకు ఎక్కడ దొరుకుతున్నార్రా బాబూ.. మరో చంద్రబాబు వచ్చాడోచ్..cbn
2019-09-06 19:11:25

ఏ బాబు.. ఎవ‌రికి బాబు.. అయినా వ‌ర్మ‌కు దొరకడం ఏంటి అనుకుంటున్నారా..? అక్క‌డున్న‌ది వ‌ర్మ‌.. త‌న సినిమా ప్ర‌మోష‌న్ కోసం ఎవ‌ర్నైనా వాడేసుకుంటాడు.. ఎలా ఉన్నా వాడేసుకుంటాడు. ఇప్పుడు కూడా ఇదే చేసి చూపిస్తున్నాడు వ‌ర్మ‌. ఈయ‌న ప్రస్తుతం కమ్మరాజ్యంలో కడప రెడ్లు సినిమా చేస్తున్నాడు ఈ చిత్రం కోసం మనుషులను పోలిన మనుషులను తీసుకొస్తున్నాడు వర్మ. ఈ ప్రపంచంలో ఒకే పోలికలో ఏడుగురు మనుషులు ఉంటారంటారు కదా.. ఆ ఏడుగురులో తనకు కావాల్సిన వాళ్లను కావాల్సినపుడు పట్టుకుంటున్నాడు వర్మ. ఇప్పుడు డూప్ చంద్ర‌బాబును పట్టుకొచ్చాడు. అప్పట్లో సోష‌ల్ మీడియాలో ఓ వీడియో స‌ర్క్యులేట్ అయింది. హోట‌ల్లో ప‌నిచేసే ఓ వ్య‌క్తి అచ్చం చంద్ర‌బాబులాగే ఉన్నాడు. అత‌న్ని చూసి నిజంగానే చంద్ర‌బాబునాయుడా ఏంటి అని మ‌న క‌ళ్ళ‌ను మ‌న‌మే మోసం చేసుకోవాలేమో..? అప్పట్లో లక్ష్మీస్ ఎన్టీఆర్ కోసం ఆయన్ని ట్రై చేసాడు కానీ కుదర్లేదు.. ఇక ఇప్పుడు మరోసారి ఇలాంటి పనే చేసాడు ఈయన. ప్రస్తుతం కమ్మరాజ్యంలో కడపరెడ్లు సినిమా కోసం అచ్చంగా చంద్రబాబులా ఉండే మరో పాత్రను తీసుకొచ్చాడు. ముంబై థియేటర్ ఆర్టిస్టును తీసుకొచ్చి అచ్చంగా బాబు మాదిరే మార్చేసాడు ఆర్జీవీ. ఇది చూసి అంతా ఫిదా అయిపోతున్నారు. మొన్న పవన్ కల్యాణ్ లుక్ కూడా ఇలాగే విడుదల చేసాడు ఈయన.

More Related Stories