గద్దలకొండ గణేష్‌ కి సాయం చేసిన ఎన్టీఆర్ చరణ్‌Charan Jr NTR
2019-09-24 14:40:22

మెగా హీరో వరుణ్‌ తేజ్‌ లీడ్ రోల్ లో డైరెక్టర్‌ హరీష్‌ శంకర్‌ తెరకెక్కించిన చిత్రం 'గద్దలకొండ గణేష్‌'. వాల్మీకిగా రిలీజ్ కావాల్సిన సినిమా బోయ కులస్థుల గొడవ వలన గద్దలకొండ గణేష్ గా మారింది. కాంబినేషన్‌లో 14 రీల్స్‌ ప్లస్‌ బేనర్‌పై రామ్‌ ఆచంట, గోపీ ఆచంట అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాలో పూజా హెగ్డే, తమిళ హీరో అధర్వ మురళి కీలక పాత్రలు పోషించారు. మొన్న శుక్రవారం విడుదలయిన ఈ సినిమా మొదటి ఆట నుండే పాజిటివ్‌ టాక్‌ తో మంచి కలెక్షన్స్‌ రాబడుతోంది. 

ఈ నేపధ్యంలో నిన్న హైదరాబాద్‌ జె.ఆర్‌.సి కన్వెన్షన్స్‌లో సక్సెస్‌ మీట్‌ను ఏర్పాటు చేశారు సినిమా యూనిట్. ఈ మీట్ లో మెగా హీరో వరుణ్‌ తేజ్‌ మాట్లాడుతూ గద్దల కొండ గణేష్‌ సినిమాని ఇంత పెద్ద సక్సెస్‌ చేసిన ప్రతి ఒక్కరికీ థాంక్స్‌ అంటూ మొదలు పెట్టాడు. ఈ సినిమాతో అధర్వ నాకు మరో బ్రదర్‌ అయ్యారని చెప్పుకొచ్చాడు. అలాగే ఈ సినిమా రిలీజ్‌కి ముందు టైటిల్‌ మార్చాలి అన్నప్పుడు చరణ్‌ అన్నకి ఫోన్‌ చేశానని అప్పుడు ఇంటికి రా అన్నారని చెప్పుకొచ్చాడు. 

ఇంటికి వెళ్తే చరణ్‌ అన్న, తారక్‌ ఇద్దరు కలిసి కూర్చొని కాఫీ తాగుతున్నారని, ఆరోజు తనకున్న స్ట్రెస్‌ ని జీరోకి తీసుకువచ్చింది వారిద్దరేనని చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా వారిద్దరికీ థాంక్స్‌ అని చెప్పుకొచ్చాడు. వారిద్దరూ తమ అనుభవంతో చెప్పిన మాటలే తన టెన్షన్ తగ్గించాయని వరుణ్ చెప్పుకొచ్చాడు. ఆ విధంగా ఆర్ఆర్ఆర్ హీరోలు వరుణ్ కి సాయం చేశారన్న మాట.

More Related Stories