మమ్మల్ని మరింత బాధ పెట్టొద్దు.. ఎస్పీ చరణ్ Charan
2020-09-29 08:39:10

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం కరోనాను జయించినప్పటికి ఇతర అనారోగ్య సమస్యల కారణంగా ఆయన తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. చెన్నై లోని ఎంజీఎం ఆస్పత్రిలో బాలు చికిత్స పొందుతుండగా ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ ప్రతి రోజు బాలు ఆరోగ్యం గురించి మీడియాకు వెల్లడించాడు. కొన్ని రోజుల తరవాత తన తండ్రి ఆరోగ్యం మెరుగుపడిందని పాటలు కూడా వింటున్నాడని చెప్పాడు. దాంతో బాలు అభిమానులు తమ అభిమాన గాయకుడు త్వరలోనే తిరిగి వస్తాడని మళ్ళీ పాటలు పాడతాడాని ఆశించారు. అయితే సడెన్ గా బాలు తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడాని చెప్పడం..ఆ తరవాత 24గంటల్లో ఆయన మరణించడంతో అనుమానాలు మొదలయ్యాయి. అంతే కాకుండా ఎంజియం ఆస్పత్రి డబ్బులకోసమే బాలుని ఆస్పత్రిలో ఉంచుకుంది అని సోషల్ మీడియాలో ప్రచారం మొదలయ్యింది.

కాగా ఈ అంశంపై ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ మండి పడ్డారు. అవన్నీ రుమర్లే అని కొట్టిపారేశారు. ఎంజీఎం ఆస్పత్రి తన తండ్రికి మంచి వైద్యం అందించిందని అన్నారు. డాక్టర్లు సైతం తన తండ్రి కోసం ప్రార్థనలు చేసారని వెల్లడించారు. తమిళనాడు ప్రభుత్వం, ఉపరాష్ట్రపతి తన తండ్రి ఆరోగ్యంపై ఎంతో కేర్ తీసుకున్నారని తెలిపారు. దయచేసి రూమర్లు క్రేయేట్ చేసి తమను మరింత భాధపెట్టొద్దని రిక్వెస్ట్ చేశారు. అంతే కాకుండా తన తండ్రి ప్రస్థానాన్ని తాను కొనసాగిస్తానని పేర్కొన్నారు. తన తండ్రే తనకు భారత రత్న అని పేర్కొన్నారు. భారత రత్న ఇస్తే సంతోషిస్తానని వెల్లడించారు.

More Related Stories