ఛార్మింగ్ ఛార్మి పుట్టిన రోజు...హ్యాపీ బర్త్ డే ఛార్మిcharmi
2020-05-17 23:20:43

నటి ఛార్మీ తెలుగులో హీరోయిన్ గా అడుగు పెట్టి చాలా మంది హీరోలతో నటించింది. అలా టాలీవుడ్ చార్మింగ్ గర్ల్ గా పేరు తెచ్చుకున్న ఆమె నేటితో 33వ ఏటలోకి అడుగుపెట్టింది. నటిగా, నిర్మాతగా మంచి సక్సెస్ సాధించిన ఛార్మి మలయాళం, కన్నడ, తమిళం, తెలుగు, హిందీ సినిమాలతో కలసి దాదాపు 40 సినిమాల్లో నటించింది. ఇక ఈ అమ్మడికి మాస్, అనుకోకుండా ఓ రోజు, పౌర్ణమి, రాఖీ సినిమాలు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. ప్రతి హీరోయిన్‌ ఒకానొక సమయంలో సినిమాలకు గుడ్‌ బై చెప్పాల్సిందే. అలాగే ఈ అమ్మడు కూడా సినిమాలకు గుడ్‌ బై చెప్పేసి పూరితో కలిసి నిర్మాణ భాగస్వామిగా మారిపోయింది. పూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలకు ప్రొడక్షన్‌ మేనేజర్‌ గా, నిర్మాణ భాగస్వామిగా చేస్తోంది ఆమె. ఇక తాజాగా కరోనాపై ఛార్మి చేసిన టిక్‌టాక్‌.. నెటిజన్ల ఆగ్రహానికి గురిచేసింది. దీంతో ఆమె ఆ వీడియో డిలిట్ చేసి.. క్షమాపణలు చెప్పింది. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ అనే ఈ మహమ్మారి గురించి అందరూ ఆందోళన చెందుతున్న తరుణంలో సినీ నటి, నిర్మాత చార్మీ కాస్త వెటకారం జోడించి పోస్టు చేసింది. కరోనా ఇక్కడికి కూడా వచ్చేసిందట కదా, ఆల్ ది బెస్ట్ అంటూ వైరస్ కు స్వాగతం పలుకుతున్నట్టు ఓ టిక్ టాక్ వీడియో చేసింది.  ఆ తరువాత క్షమాపణలు చెప్పింది అనుకోండి. ఇక ఈ ఏడాది కరోనా వలన ఛార్మి పుట్టిన రోజు వేడుకలు ఏవీ ఉండకపోవచ్చు.

 

More Related Stories