ఆయన గదికి రమ్మన్నాడు..రచయితపై మరోసారి ఆరోపణలుChinmayi
2020-10-15 10:01:07

ప్రముఖ గాయని చిన్మయి గతంలో లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా "మీటూ" అంటూ ఉద్యమం ప్రారంభించిన సంగతి తెలిసిందే. అప్పుడు చిన్మయి సాహిత్య రచయిత వైరముత్తు పై లైంగిక ఆరోపణలు చేసింది. తాను ఓ కన్సర్ట్ కోసం విదేశానికి వెళ్ళినప్పుడు తనను గదికి రమ్మని వైరముత్తు ఓ వ్యక్తితో చెప్పి పంపించారని తెలిపింది. దాంతో రచయిత బండారం భయట పడింది. అయితే చిన్మయి మీటూ ఉద్యమం మొదలుపెట్టి రెండేళ్లు పూర్తయ్యింది. దాంతో ఆమె తాజాగా మరో సంచలన పోస్ట్ పెట్టింది. తనను గదికి రమ్మని వేధింపులకు గురిచేసిన రచయిత వైరముత్తు మరో యువతి తోను అలాగే ప్రవర్తించాడని పోస్ట్ లో పేర్కొంది. అంతే కాకుండా సదరు బాధితురాలు పంపిన స్క్రీన్ షాట్ లను పోస్ట్ చేసింది.

బాధితురాలి మెసేజ్ లో " నన్ను కూడా వైరముత్తు లైంగిక వేధింపులు గురిచేశారు. నేను కాలేజీలో ఉన్నప్పుడు ఆయన ఓ పుస్తక ఆవిష్కరణ కోసం వచ్చారు. అప్పుడు ఆటోగ్రాఫ్ అడిగితే ఆయన ఫోన్ నంబర్ కూడా రాశారు. నేను అప్పుడు చాలా చిన్నపిల్లను పట్టించుకోలేదు. ఆ తరవాత ఓ మీడియా ఛానల్ లో పనిచేస్తున్నప్పుడు ఆయన నా నంబర్ తీసుకుని ఓ ప్రదేశానికి రావాలని వేదించేవారు. నేను మా ఛానల్ వాళ్ళతో చెప్పడంతో వాళ్ళు వైరముత్తు భార్యకి విషయాన్ని చెప్పారు. దాంతో అతడు నోరుముస్కున్నాడు. ఎన్నోరోజల నుండి ఈ విషయం చెప్పాలనుకున్న కానీ మా అత్తామామా వద్దని, పేరు భయటకు వస్తుందని నన్ను ఆపారు" అని బాధితురాలి సంభాషనను పోస్ట్ చేసింది.

More Related Stories