అభిమానుల అత్యుత్సాహం...ఊహా టైటిల్స్chiru
2019-10-17 20:02:50

ఈ మధ్య కాలంలో ఫ్యాన్స్ ఏమాత్రం ఆపుకోలేక పోతున్నారు. తమ తమ అభిమాన హీరోల సినిమాల విషయంలో తమ తమ అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. దర్శక ధీరుడు జక్కన్న తెరకెక్కిస్తున్న లేటెస్ట్ సినిమా ఆర్ఆర్ఆర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోలుగా నటిస్తున్న ఈ భారీ మల్టీస్టారర్ సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచే ఇండియా వైడ్ హ్యూజ్ హైప్ వచ్చింది. ఆర్ఆర్ఆర్ టైటిల్ ఇంకా ప్రకటించకున్నా దానికి పేరు కూడా ఒకటి అనేసుకుని  ఫ్యాన్ మేడ్ ఎడిట్స్ చేసి సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు చిరంజీవి సినిమా వంతు వచ్చంది. సైరా తర్వాత చిరంజీవి కొరటాల దర్శకత్వంలో నటించనున్నారన్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు.

నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో చిరంజీవి 152వ సినిమా టైటిల్ అంటూ 'గోవింద ఆచార్య' అనే పోస్టర్ తో ఉన్న పిక్ ఒకటి వైరల్ అయ్యింది. ఈ టైటిల్ పరిశీలిస్తున్నట్లు, వర్కింగ్ టైటిల్ గా దీనినే కొనసాగిస్తారని. టైటిల్ పై చిత్ర యూనిట్ మొత్తం ఏకాభిప్రాయానికి వస్తే అధికారికంగా ప్రకటిస్తారని ప్రచారం సాగింది. చిరు 152 మూవీ కథాంశం దేవాదాయ శాఖకు సంబంధించినదని ఇటీవలే వార్తలు వచ్చిన క్రమంలో అభిమానులే అత్యుత్సాహంతో ఊహించుకుని ఈ ప్రచారం మొదలెట్టి ఉండచ్చు. ఈ ప్రచారాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ సంస్థ ఖండించింది. ఇప్పటికి టైటిల్ ఏమీ అనుకోలేదని ఇలాంటి ప్రచారాన్ని నమ్మకండని పేర్కొంది.

More Related Stories