చిరు దసరా కానుక...152 షురూ chiranjeevi
2019-10-08 14:18:29

సైరా నరసింహారెడ్డి హిట్‌తో మంచి జోష్‌ మీద ఉన్న చిరు.. అంతే హుషారుతో 152వ సినిమా మొదలు పెట్టారు. విజయదశమి సందర్భంగా ఈ సినిమా పూజా కార్యక్రమం జరిగింది. కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిపి కొణిదెల ప్రొడక్షన్స్‌ ఈ సినిమా నిర్మిస్తోంది. కుటుంbaసభ్యుల సమక్షంలో సినిమా ప్రారంభమైంది. మెగాస్టార్ భార్య సురేఖ మొదటి క్లాప్‌ కొట్టారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్టు చిత్రయూనిట్ తెలిపింది. 

అయితే నిజానికి చిరంజీవితో క‌లిసి రామ్ చ‌ర‌ణ్ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడ‌నే వార్తలు వినిపిస్తున్న నేపధ్యంలో అది ఈ సినిమా కోసమే అని కూడా అంటున్నారు. తండ్రీ కొడుకులు క‌లిసి ఇప్పటికే మూడుసార్లు ఒకే స్క్రీన్‌పై క‌నిపించారు. ప‌దేళ్ల కింద ‘మ‌గ‌ధీర‌’లో త‌న‌యుడితో క‌లిసి న‌టించిన చిరు, ఆ త‌ర్వాత మూడేళ్ల కింద ‘బ్రూస్లీ’లో మ‌రోసారి మెరిశాడు. చరణ్ ఏమో ‘ఖైదీ నెం.150’లో పాట‌లో చిరుతో కలిసి రెండు స్టెప్పులేసాడు. 

ఇక ఇప్పుడు నాలుగోసారి చిరు, చ‌ర‌ణ్ క‌లిసి ఈ సినిమాలోనే నటించబోతున్నారని అంటున్నారు. ఈ క‌థ‌లోనే ఓ ప‌వ‌ర్ ఫుల్ రోల్ చ‌ర‌ణ్ కోసం డిజైన్ చేశాడట కొర‌టాల‌. ఆ పాత్ర చ‌ర‌ణ్ త‌ప్ప వేరే ఎవ‌రు చేసినా కూడా సూట్ కాద‌ని భావిస్తున్నాడట. అందుకే ఆయ‌న్ని ఒప్పించి ఫ్లాష్ బ్యాక్‌లో వ‌చ్చే ఈ పాత్ర చ‌ర‌ణ్‌తో చేయించాల‌ని చూస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. సినిమాకు నిర్మాత కూడా ఆయనే కాబట్టి ఆ పాత్ర చేస్తే మార్కెట్ కూడా పెరుగుతుంది కాబట్టి చరణ్ కూడా ఓకే చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

More Related Stories