చిరంజీవి ఆచార్య టీజర్ టాక్ Acharya
2021-01-29 16:17:42

మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న  ఆచార్య టీజర్ వచ్చేసింది.'ఇతరుల కోసం జీవించే వారు దైవంతో సమానం.. అలాంటి వారి జీవితాలే ప్రమాదంలో పడితే ఆ దైవమే వచ్చి కాపాడాల్సిన పనిలేదు..' అంటూ రాంచరణ్ వాయిస్ ఓవర్ తో ఈ టీజర్ ప్రారంభమైంది. ధర్మస్థలిలో అడుగుపెట్టిన ఆచార్య అక్కడి వారికోసం చేసే పోరాటాన్ని ఇందులో చూపించారు. 'పాఠాలు చెప్పే అలవాటు లేకపోయినా అందరూ ఎందుకో 'ఆచార్య' అంటుంటారు.. బహుశా గుణపాఠాలు చెప్తాననేమో..' అంటూ చిరంజీవి చెప్పే డైలాగ్ తో టీజర్ ముగిసింది.  

శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్లపై నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ 'ఆచార్య' సినిమాలో రామ్ చరణ్ కూడా భాగం పంచుకుంటున్నారు. చెర్రీ `సిద్ధ` పాత్రలో నటించడంతో పాటు నిర్మాణ భాగస్వామిగా ఆయన ఉండటం విశేషం. చిత్రంలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీపై మెగా అభిమానుల్లో ఓ రేంజ్ అంచనాలున్నాయి.

More Related Stories