విక్ర‌మ్ వేద రీమేక్ లో నాగార్జున మెగాస్టార్



 Chiranjeevi
2021-04-29 10:53:25

ప్ర‌స్తుతం టాలీవుడ్ లో మ‌ల్టీస్టార‌ర్ ల జోరు న‌డుస్తోంది. టాప్ హీరోలు సైతం క‌లిసి న‌టిస్తున్నారు. రామ్ చ‌ర‌ణ్ ఎన్టీఆర్ లు హీరోలుగా ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ఆర్ఆర్ఆర్ సినిమాను ప్రారంభించారు. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ శర‌వేగంగా జ‌రుగుతోంది. మ‌రోవైపు రానా ప‌వ‌న్ క‌ల్యాణ్ లు హీరోలుగా మ‌ల‌యాళ సినిమా అయ్య‌ప్ప‌నుమ్ కోషియం రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమా కూడా షూటింగ్ ద‌శ‌లో ఉంది. అయితే ఇప్పుడు టాలీవుడ్ లో మ‌రో మ‌ల్టీస్టార‌ర్ కు రంగం సిద్ద‌మ‌వుతున్న‌ట్టు తెలుస్తోంది. 

త‌మిళంలో సూప‌ర్ హిట్ గా నిలిచిన విక్ర‌మ్ వేద సినిమాను తెలుగులో రీమేక్ చేయ‌బోతున్న‌ట్టు కొద్దిరోజులుగా వార్త‌లు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. త‌మిళంలో ఈ సినిమాలో మాద‌వ‌న్, విజయ్ సేతుప‌తి న‌టించారు. ఇక తెలుగు వ‌ర్ష‌న్ లో ప‌వ‌న్ క‌ల్యాణ్, ర‌వితేజ‌, విక్ట‌రీ వెంక‌టేష్ నారా రోహిత్ ల పేర్లు వినిపించాయి. అయితే దీనిపై ఇప్టటి వ‌ర‌కూ ఎలాంటి అఫీషియ‌ల్ అనౌన్స్మెంట్ రాలేదు. 

ఇక ఇప్పుడు తాజాగా మ‌రో ఇద్ద‌రు స్టార్ హీరోల పేర్లు వినిపిస్తున్నాయి. మ‌న్మ‌థుడు నాగార్జున‌..మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాలో న‌టించ‌బోతున్నారని గుస‌గుసలు వినిపిస్తున్నాయి. ఇక ఈ ఇద్ద‌రు హీరోలు ఇప్ప‌టి వ‌ర‌కూ క‌లిసి న‌టించ‌లేదు. కానీ మంచి ఫ్రెండ్స్ అన్న సంగ‌తి తెలిసిందే. అంతే కాకుండా వీరిని ఒకే స్క్రీన్ పై చూడాల‌ని వీరి అభిమానులే కాకుండా తెలుగు ప్రేక్ష‌కులంతా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమా ప‌ట్టాలెక్కుతుందా..లేదా చూడాలి. 

More Related Stories